పిల్లలకి ఆటలుంటే చాలు తిండి మీద ధ్యాసే ఉండదు. ఆటపాటల్లో పడి ఆకలిని మర్చిపోతారు. దాంతో వాళ్లతో నాలుగు ముద్దలు తినిపించడానికి ఏవేవో ఫీట్లు చేస్తుంటారు పేరెంట్స్. కానీ, ఎన్ని తిప్పలు పడి తినిపించినా ముద్ద గొంతు దిగదు కొందరు పిల్లలకి. ఆకలి లేదు.. తినబుద్ధి కావట్లేదంటారు. మరి అలాంటి పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ల ఆకలి పెంచడానికి ఏం చేయాలి.....
*మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పిల్లలకి ఆయిల్ ఫుడ్ పెట్టకూడదు. బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడూ హెల్దీగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే జీర్ణక్రియ బాగా జరిగి పిల్లలకి ఆకలి పెరుగుతుంది, కడుపునిండా తింటారు.
*పిల్లలకి ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా.. కొద్దికొద్దిగా తినిపించాలి. దానివల్ల ఆహారం త్వరగా జీర్ణమై ఆకలి అవుతుంది. శరీరంలో కొవ్వు పేరుకోదు కూడా. అలాగే సాధ్యమైనంత వరకు ఫ్యామిలీ అంతా కలిసి తింటే పిల్లల దృష్టి ఆహారం మీదకు మళ్లి హాయిగా తింటారు. పిల్లల్ని కనీసం ఒక గంటైనా ఆరుబయట ఆడుకునేలా చూడాలి.
*చిన్నపాటి ఎక్సర్సైజ్ లు కూడా చేయించాలి. దానివల్ల ఆకలి పెంచే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. పిల్లలకి ఎప్పుడూ ఒకేరకమైన ఫుడ్ పెట్టకూడదు. వాళ్లకి ఇష్టం లేని ఫుడ్ ని కూడా కాస్త డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తే ఇష్టంగా తింటారు వాళ్లు.
ALSO READ : నీ కష్టం, నీ త్యాగం.. నీ ఫ్యామిలీ, ఈ సొసైటీ దృష్టిలో ఎంత..?
*జంక్ ఫుడ్ ఆకలిని చంపేస్తుంది. అందుకే చిప్స్, బర్గర్, పిజ్జా లాంటి జంక్ ఫుడ్ కి పిల్లల్ని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి. వాటికి బదులుగా రాగిజావ, నువ్వుల చిక్కీలు, ఓట్స్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు ఇవ్వాలి.
