ఇదేం పరేషాన్ బై..22-ఏలో ప్రభుత్వ భూములతో  పాటు ప్రైవేటు ఆస్తులూ

ఇదేం పరేషాన్ బై..22-ఏలో ప్రభుత్వ భూములతో  పాటు ప్రైవేటు ఆస్తులూ
  •  బేస్ సర్వే నంబర్ బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రైవేటు హక్కులకూ గండి
  •     జీవో 59, 166 పట్టాలు.. సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములకూ 22-ఏ షాక్
  •     రికార్డుల్లో ఒక లెక్క.. క్షేత్ర స్థాయిలో మరో లెక్క
  •     అధికారుల తప్పిదానికి సామాన్యుల ఆస్తులే బలి
  •     ఒక్క అల్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ‘లక్ష’ గజాలు నిషేధిత లిస్టులోకి
  •     నివాసాలు, అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లకు రెవెన్యూ యంత్రాంగం ఝలక్
  •     ప్రభుత్వ పట్టాలు, సర్​ప్లస్, ఇతరత్రా అన్ని పేర్లు, విస్తీర్ణంతో అప్ డేట్ చేసేందుకు కసరత్తు

హైదరాబాద్, వెలుగు: అధికారుల చిన్న తప్పు.. పెద్ద నష్టానికి దారితీసింది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనా లోపాలు రాష్ట్రంలో వేలాది మంది ఆస్తిదారులకు తీవ్ర మానసిక క్షోభను, భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తున్నాయి. భూములు, స్థలాల వర్గీకరణలో చోటుచేసుకున్న ఒక సాంకేతిక తప్పిదం ఇప్పుడు సామాన్యుల పాలిట పెద్ద శాపంగా మారింది. గతేడాది హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ శాఖ సెక్షన్ 22-ఏ నిషేధిత భూముల జాబితాను అప్​డేట్ చేసింది. అప్పటి నుంచి ప్రధానంగా నాన్-అగ్రికల్చర్ (వ్యవసాయేతర) నిషేధిత జాబితా తయారీలో అధికారులు అనుసరించిన విధానమే ఈ గందరగోళానికి కారణమైంది. మొత్తం భూవిస్తీర్ణంలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ, నిషేధిత జాబితాలో చేరిన సర్వే నంబర్ల సంఖ్య మాత్రం భారీగా పెరిగింది.

గతంలో ప్రభుత్వం సక్రమంగా క్రమబద్ధీకరించినవి, పేదలకు జీవోలు 166, 59 ద్వారా పట్టాలిచ్చినవి, సీలింగ్ సర్ ప్లస్, భూదాన్ భూములు సైతం ఈ బ్లాక్ లిస్టులోకి చేరాయి. ఒక సర్వే నంబర్ పరిధిలో ఎంత భూమి ప్రభుత్వానిది, ఎంత నిషేధిత జాబితాలోకి వస్తుందో తేల్చకుండా, ఏకంగా బేస్ (మూల) సర్వే నంబర్ మొత్తాన్ని బ్లాక్ చేయడమే ఈ గందరగోళానికి మూలం. ఒక్క అల్వాల్ పరిధిలోనే ఏకంగా లక్ష గజాల ప్రైవేటు ఆస్తులు ఈ నిషేధిత లిస్టులో చిక్కుకుపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రైవేటు నివాస స్థలాలు, గృహాలు ఏండ్ల క్రితమే హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ, జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ అనుమతులతో లేఅవుట్లలో కట్టుకున్న అపార్ట్​మెంట్లు, పక్కా రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్న స్థలాలు కూడా ఆంక్షల పరిధిలోకి వచ్చాయి.  రాష్ట్రవ్యాప్తంగా బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో  మేల్కొన్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు రికార్డులను జల్లెడ పడుతున్నారు.

బేస్ సర్వే నంబర్ల బ్లైండ్ బ్లాకింగ్.. హక్కులపై తీవ్ర ప్రభావం

రాష్ట్రంలోని అనేక పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా భూములు, స్థలాలు గతంలో ఏదో ఒక రూపంలో ప్రభుత్వ భూముల జాబితాకు లింక్ అయి ఉండటమే ప్రస్తుత సమస్యకు ప్రధాన మూలం. కాలక్రమేణా ఆయా బేస్ సర్వే నంబర్ల నుంచి వేరుపడి ‘బై’ నంబర్లు (ఉప సర్వే నంబర్లు) ఏర్పడినప్పటికీ, హక్కుల నమోదులో సరైన స్పష్టత లేకపోవడంతో అధికారులు మొత్తం బేస్ సర్వే నంబర్‌‌‌‌నే 22-ఏ జాబితాలో వేశారు. కొన్ని ప్రాంతాల్లో అసైన్డ్, ప్రభుత్వానికి చెందిన భూముల్లో ఏళ్ల క్రితమే నివాసాలు వెలిశాయి. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఈ ఇంటి నంబర్ల వివరాలు నమోదు కాకపోవడంతో, అధికారులు కేవలం పాత సర్వే నంబర్లను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని నిషేధిత జాబితా రూపొందించారు.

ఫలితంగా, చట్టబద్ధంగా ఇళ్లు నిర్మించుకుని ఉంటున్న వేలాది మంది బాధితుల ఇళ్లు కూడా 22ఏ ఉచ్చులో చిక్కుకుపోయాయి. గతంలో ప్రభుత్వ స్థలాలను, సర్ ప్లస్ భూములను ఆక్రమించి నివాసాలు ఏర్పాటు చేసుకున్న పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం వివిధ జీవోల (ముఖ్యంగా జీవో 166, జీవో 59) ద్వారా క్రమబద్ధీకరించి, చట్టబద్ధ పట్టాలను మంజూరు చేసింది. ఒకే సర్వే నంబర్‌‌‌‌లోని కొంత భాగాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించగా, మరికొంత భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండిపోయింది. అయితే, అధికారులు నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరణ పూర్తయిన ఇండ్ల స్థలాలను ప్రభుత్వ భూముల జాబితా నుంచి రికార్డుల పరంగా వేరు చేయడంలో విఫలమయ్యారు. రికార్డులను అప్‌‌‌‌డేట్ చేయకపోవడంతో ఆ సక్రమ ఆస్తులు కూడా నిషేధిత జాబితాలోనే ఉండిపోయాయి. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి నేరుగా వేలం పాటల ద్వారా కొనుగోలు చేసిన స్థలాలు, పట్టాలు పొందినవి చట్టప్రకారం ప్రైవేటు ఆస్తులుగా మారాల్సి ఉండగా, రెవెన్యూ రికార్డుల్లో బేస్ సర్వే నంబర్లు ఇప్పటికీ ప్రభుత్వ భూములుగానే దర్శనమిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద మొన్నటి వరకు ఇవి బై నంబర్లతో, లేఅవుట్ నంబర్లతో చేతులు మారాయి. ఆ క్రమంలో చాలా అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం బేస్ సర్వే నంబర్ నిషేధిత జాబితాలో చేర్చి ఏదీ కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదని స్పష్టం చేశారు.
అంకెల గందరగోళం.. అర్బన్ ల్యాండ్ సీలింగ్, 

ఇనాం భూముల తలనొప్పులు

రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22(1) విభాగంలో ఏ నుంచి ఇ వరకు ఐదు రకాల భూములను (ఎ. అసైన్డ్, బి. ప్రభుత్వ, అటవీ, సి. వక్ఫ్, దేవాదాయ, డి. సీలింగ్ మిగులు, ఇ. భూసేకరణ, కోర్టు కేసులు) విభజించారు. 2025 డిసెంబరు నాటికి నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 91,15,723 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయి. అంతకుముందు పాత జాబితాలో ఇది 95,85,033 ఎకరాలుగా ఉన్నది. అర్బన్ ప్రాంతాల విషయానికొస్తే కొత్త జాబితా ప్రకారం 86,664 ఎకరాలు, పాత జాబితా ప్రకారం 1.31 లక్షల ఎకరాల విస్తీర్ణం నిషేధిత జాబితాలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ముఖ్యంగా అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్‌‌‌‌సీ) భూములు, ఇనామ్, అసైన్డ్, చెరువు శిఖం, బఫర్ జోన్లతో కలిసి ఉన్న ప్రైవేటు భూములను వేరు చేయకపోవడంతో ప్రైవేటు పట్టాదారులు నష్టపోతున్నారు.

ఇప్పుడిచ్చే లిస్ట్‌‌‌‌లో బైనంబర్, పేరు, విస్తీర్ణం ఉంటే రిజిస్ట్రేషన్

ఇటీవలి కాలంలో వివిధ జిల్లాల్లో నిషేధిత భూముల జాబితాపై వివాదాలు తీవ్రం కావడం, బాధితుల నుంచి నిత్యం వినతులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. సమస్య తీవ్రతను గుర్తించి ప్రస్తుతం జిల్లా కలెక్టర్లు సదరు రికార్డులను పునఃపరిశీలించే పనిలో పడ్డారు. ఎక్కడెక్కడ సాంకేతిక లోపాలు తలెత్తాయో గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. గతంలో జీవోలు 166, 59 ద్వారా క్రమబద్ధీకరణ పూర్తయి రిజిస్ట్రేషన్లు జరిగిన స్థలాలను, బేస్ సర్వే నంబర్ల నుంచి వేరుపడిన ప్రైవేటు స్థలాలను గుర్తించి నివేదికలు తయారు చేస్తున్నారు. బాధితుల నుంచి అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయి సరిహద్దులతో సరిపోల్చుతున్నారు. జిల్లా కలెక్టర్లు గ్రామాల వారీగా రూపాంతరం చేసిన తుది సవరణ జాబితాను ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం ఆ జాబితాను పరిశీలించి తుది ఆమోదం తెలిపిన తరువాత మాత్రమే నిషేధిత జాబితా ఆంక్షల నుంచి సామాన్యులకు విముక్తి లభించి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పునఃప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎవరెవరికి పట్టాలు ఇచ్చారు. రెగ్యులరైజేషన్ చేశారు. సర్ ప్లస్ ల్యాండ్‌‌‌‌లో ఎవరున్నారు అనే వివరాలు పేర్లు, విస్తీర్ణంతో జాబితా రెడీ చేసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌‌‌‌లకు ఇస్తారు. వారికి ఆస్తులను ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశిస్తారు.

హైకోర్టు ఆదేశాలతోనే అమలు

ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్లతో చేతులు మారుతున్నట్టు పలు కేసుల్లో గుర్తించిన హైకోర్టు నిషేధిత భూముల జాబితాను అప్డేట్ చేయాలని 2015లో అప్పటి ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో 2024లో మరోమారు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం 2025 డిసెంబర్ లో ప్రభుత్వ భూముల వివరాలను రెవన్యూ శాఖ నిషేధిత జాబితాలో చేర్చింది. తహసీల్దార్, ఆర్డీవో, జేసీ, కలెక్టర్ల సంతకాలతో కూడిన సర్వే నంబర్ల వివరాలను రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్ సైట్ లో అప్లోడ్ చేసింది. దీంతో 22ఏ కింద ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది.

ఏమిటీ 22ఏ.. ఎఫెక్ట్ ఎవరికి?

రాష్ట్రంలో భూముల అక్రమ క్రమవిక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు నిర్దేశించిందే రిజిస్ట్రేషన్ల చట్టం-1908లోని ‘సెక్షన్ 22-ఏ’. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, అటవీ, సీలింగ్, కోర్టు జప్తులో ఉన్న భూములుంటాయి. వాటిని ప్రైవేటు వ్యక్తులుఅమ్మడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడాన్ని నిరోధించడానికే ‘నిషేధిత భూముల జాబితా’(22-ఏ)ను రూపొందిస్తారు. రెవెన్యూ పాత రికార్డులు (పహాణీలు, సేత్వార్), దేవాదాయ, వక్ఫ్ తదితర శాఖల అధికారులు సేకరించిన సర్వే నంబర్ల వివరాలను ముందుగా కలెక్టర్‌‌‌‌కు సమర్పిస్తారు. కలెక్టర్ వాటిని పరిశీలించి ఆమోదించిన అనంతరం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అధికారిక జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు అప్పగించి, సబ్‌‌‌‌రిజిస్ట్రార్ కార్యాలయాల ‘కార్డ్’ కంప్యూటర్ సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌లో నమోదు చేస్తారు. ఇలా సిస్టమ్‌‌‌‌లో నమోదైన సర్వే నంబర్లలో ఉన్న ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు లేదా బ్యాంక్ మార్టిగేజ్‌‌‌‌ల కోసం దరఖాస్తు చేసినా సాఫ్ట్‌‌‌‌వేర్ ఆటోమేటిక్‌‌‌‌గా రిజిస్ట్రేషన్‌‌‌‌ను నిలిపివేస్తుంది.