KBR పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమలుకు రంగం సిద్దమైంది.. రేపటి (ఆగస్టు 18)నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ వన్ వే అమలు చేయనున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పార్కు చుట్టూ మొత్తం 13 లైన్ ఛేంజర్స్, 10 ఎగ్జిట్ లను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్ఫింగ్, సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనాల రాకపోకలను సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాలతో పర్యివేక్షించనున్నారు. ఇక కేబీఆర్ పార్కు కు వచ్చే వాకర్స్, విజిటర్స్ కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. వన్ వే ట్రాఫిక్ విధానం దాదాపు రెండేళ్ల పాటు అమలులో ఉంటుందని, వాహనదారులు కొత్త ట్రాఫిక్ విధానానికి సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ కోరారు.
హైదరాబాద్: KBR పార్కు చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమలు చేయనున్నారు. మంగళవారం( ఆగస్టు18) ఉదయం 6గంటలనుంచి వన్ ట్రాఫిక్ అమలులోకి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. దాదాపు రెండేళ్లపాటు వన్ వే ట్రాఫిక్ విధానం అమలులో ఉండనుంది. H-City ప్రాజెక్ట్ పనుల క్రమంలో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.
KBR పార్కు చుట్టూ వాహనాల రాకపోకలను సీసీ కెమెరాలు, డ్రోన్లు, హై రైజ్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. వాకర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. KBR పార్క్ విజిటిర్స్ పార్కింగ్ కోసం కొన్ని ప్రాంతాలను ట్రాఫిక్ అధికారులు ఎంపిక చేశారు. ట్రాఫిక్ అధికారులు సూచించిన ప్రాంతంలోనే కేబీఆర్ పార్క్ విజిటర్స్ పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వన్ వే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకొని వాహనదారులు తమ ప్రయాణాల ప్రణాళికను సిద్దం చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కొత్త ట్రాఫిక్ విధానానికి వాహనదారులు సహకరించాలన్నారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
