Ajay Devgn: విమల్ యాడ్ వివాదంపై అజయ్ దేవ్‌గణ్ సంచలన కామెంట్స్.. FDA నోటీసులపై ఎమన్నారంటే?

Ajay Devgn: విమల్ యాడ్ వివాదంపై అజయ్ దేవ్‌గణ్ సంచలన కామెంట్స్.. FDA నోటీసులపై ఎమన్నారంటే?

బాలీవుడ్‌ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్‌కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) భారీ షాక్ ఇచ్చింది. 'విమల్ ఎలక్టాయిస్' ప్రకటనలో నటించిన ఈ ముగ్గురు స్టార్లకు షోకాజ్ నోటీసులు ఆగస్టు 11న జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా మహారాష్ట్రలో నిషేధం ఉన్న విమల్ పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారనే అనుమానంతో FDA ఈ చర్యలు చేపట్టింది. 

లేటెస్ట్ గా FDA నోటీసులపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ స్పందించారు. ఈ యాడ్ లో నటించడం పూర్తిగా నా వ్యక్తగత ఎంపిక. ఒక ప్రకటనలో నటించే ముందు అది హానికరమా కాదో తెలుసుకోని చేస్తాం. అందుకే కొన్ని బ్రాండ్ లకు నేను ప్రచారం చేయడం లేదు.  గతంలో యాలకులకు సంబంధించిన ప్రకటనలో నటించా. నిజంగా అవి అంత హానికరమైనవి అయితే వాటి అమ్మకాలనే బ్యాన్ చేయాలి కదా? అని వ్యాఖ్యానించారు.

2024లో విడుదలైన ఈ యాడ్‌లో షారుక్ ఖాన్, అజయ్ దేవ్‌గణ్, టైగర్ ష్రాఫ్ కలిసి కనిపించారు. అయితే 'విమల్' బ్రాండ్ పేరు పాన్ మసాలాతో బలంగా అనుసంధానమై ఉండటంతో, ఎలక్టాయిస్ పేరుతో అదే బ్రాండ్ గుర్తింపును కొనసాగించే ప్రయత్నంగా ప్రకటన కనిపిస్తోందని FDA పేర్కొంది. దీనివల్ల వినియోగదారులు తప్పుదోవ పట్టే అవకాశం ఉందని, నిషేధిత ఉత్పత్తికి పరోక్షంగా ప్రచారం జరిగే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.

►ALSO READ | Ravi Teja: చిన్నారి నక్షత్రపై రవితేజ అనుచిత పదజాలం.. మీ అమ్మాయిని అంటే ఊరుకుంటారా? అంటూ నెటిజన్లు ఫైర్!

ముగ్గురు నటులు 15 రోజుల్లోగా తమ వివరణ ఇవ్వాలని తుకారాం ముండే నేతృత్వంలోని మహారాష్ట్ర FDA ఆదేశించింది. అంతేకాదు, యాడ్‌కు సంబంధించిన ప్రచార కంటెంట్‌ను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించాలని సూచింది. ఎండార్స్‌మెంట్ ఒప్పందాలు, క్యాంపెయిన్ వివరాలు, చెల్లింపులు, బ్రాండ్‌పై చేసిన పరిశీలనకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించాలని కోరింది.

మరోవైపు, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో కొత్త చర్చకు తెరలేపింది. కోట్లాది మంది అభిమానులను కలిగి ఉన్న సెలబ్రిటీలు ప్రజారోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల ప్రచారంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముగ్గురు హీరోలకు ఎదురైన తొలి వివాదం మాత్రం కాదు. గతంలో ఇదే బ్రాండ్ యాడ్‌లో నటించిన అక్షయ్ కుమార్ తీవ్ర విమర్శలు రావడంతో తన నిర్ణయంపై అభిమానులకు క్షమాపణలు చెప్పి ప్రచారం నుంచి తప్పుకున్నారు. ఇక ఈ అంశంలో తదుపరి చర్యలు ముగ్గురు నటులు ఇచ్చే వివరణపై ఆధారపడి ఉండనున్నాయి..