పశ్చిమ బెంగాల్ బీజేపీపై కాక్రోచ్ పార్టీ తీవ్రఆరోపణలు చేసింది.తమ వాలంటీర్ ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి కుటుంబ సభ్యులను తీవ్రంగా కొట్టారు. తీవ్రగాయాలతో ఆ వాలంటీర్ తండ్రి చనిపోయారని వెస్ట్ బెంగాల్ కాక్రోచ్ పార్టీ ఆరోపించింది. తాను చదువుకున్న స్కూల్ లో సమస్యల తెలుసుకునేందుకు వెళ్లిన వాలంటర్ ను టార్గెట్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, బెదిరింపులకు లొంగకపోవడంతో ఇంటిపై దాడి చేశారన్నారు.
స్కూల్ లో సమస్యలు ఎత్తి చూపినందుకు క్షమాపణ చెప్పాలని, ఇదంగా తనపై కొందరు వత్తిడి చేస్తే అలా చేశానని వీడియో చేసే ఇంటర్నెట్ లో అప్ లోడ్ చేయాలని వాలంటీర్ ను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాలంటీర్ నిరాకరించడంతో అతనిపైనా, అతని కుటుంబం పైనా దాడి చేశారని కాక్రోచ్ పార్టీ ఆరోపించింది. ఈ దాడిలో వాలంటీర్ స్వల్ప గాయాలతో తప్పించుకోగా.. అతని తండ్రి తలకు తీవ్రగాయమై ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
►ALSO READ | జాతీయ స్థాయిలో బీజేపీ కొత్త టీం.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా 13 మంది.. స్మృతి ఇరానీకి కీలక పదవి
తమ వాలంటీర్ పై దాడిని బెంగాల్ పోలీసులు పట్టించుకోలేదని కాక్రోచ్ పార్టీ ఆరోపించింది. శాంతి భద్రతను కాపాడటం, పౌరులను రక్షించడం పోలీసుల బాధ్యత.. అయితే ఇక్కడ బెదిరింపులకు పాల్పడిన వారికి పోలీసులు సహకరించడం సరికాదన్నారు. వాలంటరీ కుటుంబంపై దాడి చేసి ఒకరి మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Abdul’s father sustained serious head injuries yesterday after he was attacked by RW goons. His condition turned critical today, and I have just received the heartbreaking news that he has passed away.
— Ratna Singh (@whattalawyer) August 15, 2026
Is this how @BJP4Bengal and @WBPolice are functioning? When a family is under… https://t.co/4zog7rqqyv
