సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా నటించిన చిత్రం ‘గోట్’. వేదవ్యాస్ దర్శకత్వంలో మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఏషియన్ సినిమాస్ సమర్పణలో ఈ చిత్రం నవంబరు 12న థియేట్రికల్ రిలీజ్ కానుందని అనౌన్స్ చేశారు.
ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, ఈ చిత్రంలో యువతను ఆలోచింపజేసే ఓ మంచి విషయం ఉందని, సుధీర్ కెరీర్‌లో ఇది మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని మేకర్స్ అన్నారు. ఈ చిత్రానికి మణిశర్మ నేపథ్య సంగీతం, లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.
