ముంబై: దేశంలో వైట్ కాలర్ (ఆఫీస్) ఉద్యోగాల నియామకాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఏడాది లెక్కన 2 శాతం పెరిగాయని జాబ్ పోర్టల్ నౌకరీ డాట్ కామ్ రిపోర్ట్ పేర్కొంది. ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్ విభాగంలో నియామకాలు 20శాతం, ఆటో రంగానికి సంబంధించి 11శాతం పెరిగాయి.
బీపీవో/ఐటీఈఎస్, జీసీసీలు 4శాతం వృద్ధి నమోదు చేశాయి. మెట్రో నగరాల్లో హైదరాబాద్ 9శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. అనుభవజ్ఞులైన నిపుణులకు డిమాండ్ బలంగా ఉందని రిపోర్ట్ పేర్కొంది.
