Ramayana: ‘రామాయణం’ రూ.4 వేల కోట్ల బడ్జెట్‌పై యష్ క్లారిటీ.. లెక్కలన్నీ బయటపెట్టిన రాకింగ్ స్టార్!

Ramayana: ‘రామాయణం’ రూ.4 వేల కోట్ల బడ్జెట్‌పై యష్ క్లారిటీ.. లెక్కలన్నీ బయటపెట్టిన రాకింగ్ స్టార్!

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'రామాయణం' (Ramayana). ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ముఖ్యంగా ఈ సినిమా బడ్జెట్ వివరాలు సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. రెండు భాగాలకు తెరకెక్కుతున్న ఈ ఎపిక్ బడ్జెట్ ఏకంగా రూ.4 వేల కోట్లకు పైగా ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో భారతీయ సినీ వర్గాలు స్టన్ అయ్యేలా చేసింది.

గతంలో రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రా కూడా బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. ఇండియన్ మూవీ చరిత్రలో ఏ చిత్రానికి ఈ స్థాయిలో బడ్జెట్ కేటాయించింది లేదు. 'రామాయణం' బడ్జెట్ కు ఏ సినిమా కూడా దరిదాపుల్లో కూడా లేదని ఆయన తెలిపారు. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అవ్వడంతో సినీ & ట్రేడ్ వర్గాల్లో కొన్ని సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలోనే సినిమా కోసం కేటాయించిన రూ.4 వేల కోట్ల బడ్జెట్ విషయంపై హీరో, నిర్మాత యష్ కీలక వివరణ ఇచ్చారు. ఈ మొత్తం బడ్జెట్ కేవలం మొదటి భాగానికి మాత్రమే కాదని, రెండు భాగాల సినిమాలకు కలిపిన బడ్జెట్ అని స్పష్టం చేశారు. పూర్తీ వివరాల్లోకి వెళితే..

రాజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో పాల్గొన్న యష్ మాట్లాడుతూ.. రూ.4,000 కోట్లలో రెండు భాగాల నిర్మాణ ఖర్చుతో పాటు సినిమా విడుదల, ప్రమోషన్‌కు సంబంధించిన ఖర్చులు కూడా ఉన్నాయని తెలిపారు. 

హాలీవుడ్ తరహాలో బడ్జెట్ లెక్కలు..

“రూ.4,000 కోట్లు రెండు భాగాల సినిమాలకు కలిపిన బడ్జెట్. ఇందులో విడుదల, ప్రమోషన్ ఖర్చులు కూడా ఉన్నాయి. ఇది హాలీవుడ్‌లో అనుసరించే విధానమే. అక్కడ సినిమా బడ్జెట్‌కు సమానంగా లేదా కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ప్రమోషన్ కోసం ఖర్చు చేస్తారు. ఎందుకంటే సినిమా మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఆదాయం కూడా గ్లోబల్‌గానే వస్తుంది” అని యష్ వివరించారు.

గ్లోబల్ మార్కెట్‌నే టార్గెట్‌గా ‘రామాయణ’..

భారతీయ సినిమాలు దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవాలని యష్ అభిప్రాయపడ్డారు. సినిమా అనేది ఒక రకమైన సాఫ్ట్ పవర్ అని, భారతీయ కథలను అంతర్జాతీయ ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్లేందుకు మరింత కృషి చేయాలని అన్నారు. ‘రామాయణ’, ‘టాక్సిక్’ చిత్రాలు భారతీయ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగమని యష్ పేర్కొన్నారు.

ఇకపోతే, ‘రామాయణ’లో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ మొదటి భాగం దీపావళి కానుకగా నవంబర్ 8, 2026న థియేటర్లోకి కి రానుంది.