శివ రాజ్‌కుమార్, డాలీ ధనంజయ్ లీడ్ రోల్స్‌లో ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ రావు దర్శకత్వంలో వైశాక్ గౌడ నిర్మిస్తున్న కన్నడ చిత్రం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’. తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది. శుక్రవారం తెలుగు టీజర్‌ను రిలీజ్ చేశారు. ఏజెంట్ ప్రకాష్‌గా శివ రాజ్‌కుమార్, తన అసిస్టెంట్‌గా డాలీ ధనంజయ్ వింటేజ్ లుక్స్‌లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ‘ఇదొక డేంజరస్ ఆపరేషన్’ అంటూ ఇద్దరి మధ్యా సాగే సన్నివేశాలు కథపై ఆసక్తిని పెంచేలా ఉండటంతో పాటు, వారి పాత్రల్లో ఉన్న రహస్యాన్ని టీజర్ ఆసక్తికరంగా పరిచయం చేసింది.
ప్రియాంక అరుళ్ మోహన్, అదితి బాలన్, యశ్ శెట్టి, సుఖ్వీందర్ సింగ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఎమోషన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ ద్వారా రివీల్ చేశారు. చరణ్ రాజ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోరు సినిమాపై ఆసక్తిని పెంచింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్, విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
