జనగామ/ టేకులపల్లి/ తాడ్వాయి, వెలుగు : ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయ ప్రతినిధి పద్మావతి అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జనగామ, స్టేషన్ ఘన్ పూర్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణను ప్రతినిధి బృంద సభ్యులు పరిశీలించారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని తొమ్మిదోవమైలుతండా గ్రామంలో నిర్వహిస్తున్న ఎస్ఐఆర్కార్యక్రమాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పరిశీలించారు. అర్హులైన ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారమ్ చేరేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో నిర్వహిస్తున్న సర్ సర్వేను ములుగు ట్రైనింగ్ ఆర్డీవో కుశీల్వంశీ, తహసీల్దార్ సురేశ్‌బాబుతో కలిసి పరిశీలించారు.
