ప్రగతిబాట పేరుతో రాజకీయ సభలు: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

ప్రగతిబాట పేరుతో రాజకీయ సభలు: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హనుమకొండ, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి ప్రగతిబాట పేరుతో రాజకీయ సభలు పెట్టకుంటున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ ఆఫీస్ లో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో కలిసి సోమవారం నిర్వహించిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడారు. సీఎం పరకాల సభలో రైతులు, వ్యవసాయరంగానికి ఎలాంటి కొత్త హామీలు ఇవ్వలేదని విమర్శించారు. 

మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో చేపట్టిన ములుగు కలెక్టరేట్ కు రంగులేసి ప్రారంభోత్సవం చేశారన్నారు. 420 హామీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి సోషల్ జస్టిస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు మర్రి యాదవరెడ్డి, చింత సదానందం తదితరులు పాల్గొన్నారు.