హైదరాబాద్ NALSARలో మంచి జాబ్ ఆఫర్.. 35 ఏళ్లలోపు ఉన్నోళ్లకి ఛాన్స్.. మిస్సవకండి

హైదరాబాద్ NALSARలో మంచి జాబ్ ఆఫర్..  35 ఏళ్లలోపు ఉన్నోళ్లకి ఛాన్స్.. మిస్సవకండి

నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, హైదరాబాద్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన లీగల్ కన్సల్టెంట్ మారిటైమ్ లా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. 

పోస్టు పేరు: లీగల్ కన్సల్టెంట్ (మారిటైమ్ లా)

విద్యార్హతలు: మారిటైమ్ లా/ ఇన్సూరెన్స్ లా/ మారిటైమ్ సెక్యూరిటీ లా/ ఇంటర్నేషనల్ లా విభాగాల్లో ఎల్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఎం పూర్తిచేసి ఉండాలి. సంబంధిత రంగంలో 1 నుంచి 2 సంవత్సరాల వరకు పని అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

వయసు: 2026, సెప్టెంబర్ 30 నాటికి 35 ఏళ్లు మించకూడదు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: అక్టోబర్ 18.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ nalsar.ac.inను సందర్శించండి.