Delhi protest : బారీ కేడ్లు బద్దలు కొట్టుకొని.. జంతర్ మంతర్ వైపు నిరసనకారులు

Delhi protest : బారీ కేడ్లు బద్దలు కొట్టుకొని.. జంతర్ మంతర్ వైపు నిరసనకారులు

సీఈసీ జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీలో నిరసనలు ఉధృతం అయ్యాయి. నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు వందలాది మంది యువత, విద్యార్థులు, రాజకీయ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. నిరసనలకు అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. జంతర్ మంతర్  వైపు వెళ్లకుండా వివిధప్రాంతాల్లో బారీకేడ్లు అడ్డు పెట్టి అడ్డుకున్నారు. అయినా పెద్దఎత్తున తరలివచ్చిన నిరసనకారులు బారీకేడ్లను బద్దలు కొట్టి  జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్లారు.  

నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఆపలేకపోయారు. సీఈసీ రాజీనామా చేయాలని, ఎన్నికల సంఘం జవాబుదారీ తనం కోరుతూ జ్ణానేష్ కుమార్ కు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  ప్లకార్టులు చేతబట్టి ర్యాలీగా జంతర్ మంతర్ వైపు ర్యాలీగా వెళ్లారు. 

ఇదిలా ఉంటే  నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చిన ఢిల్లీ ఆప్ చీఫ్ సౌరభ్ భరద్వాజ్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ జా, ఏఐఎస్ ఏ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ సమయంలో కార్యకర్తలను పోలీసులు దారుణంగా ఈడ్చుకెళ్లి  పోలీసు వ్యాన్ పడేశారు. అయినా లెక్క చేయని విద్యార్థులు, నేతలు, యువత జంతర్ మంతర్ వైపు ర్యాలీగా కొనసాగారు. 

సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సభ్యులు ఇవాళ (అక్టోబర్2) ముంబైలో తమ నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు నిరసన చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చిన క్రమంలో శివాజీ పార్కు దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.