చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయగా, శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ షూట్ జరుగుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ను అందించాడు తమన్. ‘మెగా 158 చరిత్ర.. ఆగస్టు 22న కలుద్దాం’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అంటే చిరంజీవి బర్త్‌డే కానుకగా స్పెషల్ గ్లింప్స్ సిద్ధం చేస్తున్నట్టు తమన్ హింట్ ఇచ్చాడు. దీంతో చిరంజీవి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి ఆడిషినల్ స్క్రీన్‌ప్లే రచయితలుగా పనిచేస్తున్నారు. భాను–నందు డైలాగ్స్ రాస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు చిరంజీవి నటించిన ‘విశ్వంభర’ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ రానుంది.
