శ్రీనివాస మంగాపురం వర్షాకాలానికి వాయిదా

శ్రీనివాస మంగాపురం వర్షాకాలానికి వాయిదా

జయకృష్ణ ఘట్టమనేని,  రవీనా టాండన్ కూతురు రాషా తడాని జంటగా ‘ఆర్‌‌‌‌‌‌ఎక్స్‌‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అశ్వినీ దత్ సమర్పణలో  పి. కిరణ్ నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం  జులై 9న విడుదల కావాల్సి ఉండగా, శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.  ఈ చిత్రాన్ని  జులై 30న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

ఈ సందర్భంగా రిలీజ్ చేసిన  కొత్త పోస్టర్‌‌‌‌లో జయకృష్ణ,  రాషా తడాని ఒక కొండపై నిల్చొని, చుట్టూ మబ్బులు కమ్ముకున్న వేళ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ   రొమాంటిక్‌‌గా కనిపిస్తున్నారు.  ‘ఈ వర్షాకాలంలో వెండితెరపై అత్యంత గాఢమైన ప్రేమకథ చూసేందుకు సిద్ధంగా ఉండండి’  అంటూ క్యాప్షన్ ఇవ్వడం సినిమాపై ఆసక్తిని పెంచింది.   ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో   మోహన్ బాబు  పవర్‌‌‌‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.