Rao Bahadur Review: ‘రావు బహదూర్’ రివ్యూ.. మహేష్ బాబు నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?

Rao Bahadur Review: ‘రావు బహదూర్’ రివ్యూ.. మహేష్ బాబు నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?

నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు వెంకటేష్ మహా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన C/o కంచరపాలెం (2018) మరియు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య (2020) వంటి సినిమాలను డైరెక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే లాంగ్ గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘రావు బహదూర్’ (Rao Bahadur). 

టాలీవుడ్ వర్సటైల్ యాకర్ట్ సత్యదేవ్ హీరోగా నటించిన ఈ మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా శుక్రవారం (జులై 3, 2026న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో దీపా థామస్ హీరోయిన్‌గా నటించగా.. వికాస్ ముప్పాల, బాలా పరాశర్, ఆనంద్ భారతి కీలక పాత్రలు పోషించారు. అంతేకాకుండా, ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తన GMB ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సమర్పించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

మరి దర్శకుడు వెంకటేష్ మహా మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేశారా? సత్యదేవ్ నటన ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? థియేటర్లలో సినిమా చూసిన ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

‘రావు బహదూర్’ కథ:

కుల వ్యవస్థ, రంగు, రక్తసంబంధాలు, సామాజిక మూఢనమ్మకాల వంటి సున్నితమైన అంశాల నేపథ్యంలో సెటైరికల్, ఫిలాసఫికల్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘రావు బహదూర్’. 1968 నుంచి 1991 మధ్యకాలంలో సాగే ఈ కథలో, రామప్ప (సత్యదేవ్) అనే 60 ఏళ్ల వృద్ధుడు ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. శారీరక రుగ్మతతో బాధపడుతూ, జీవిత చరమాంకంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ బతుకుతుంటాడు.

అయితే రామప్ప తన చివరి వరకు ఏ లక్ష్యం కోసం పోరాడాడు? అతని జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఏమిటి? రేణుక (దీపా థామస్)తో అతని ప్రేమకథ ఎలా ప్రారంభమైంది? ఆమె లేకుండా రామప్ప ఎందుకు ఒంటరి జీవితాన్ని గడపాల్సి వచ్చింది? యవ్వనంలో ఎదురైన అనుభవాలు, ప్రేమ, కుటుంబ బంధాలు అతని జీవితాన్ని ఎలా మలిచాయి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘రావు బహదూర్’ సినిమా కథ.

ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే:

‘రావు బహదూర్’ సినిమాకు వరల్డ్ వైడ్ పాజిటివ్ టాక్ ఊపందుకుంది.  C/o కంచరపాలెంతో ఆకట్టుకున్న దర్శకుడు వేంకటేష్ మహా,  మరోసారి తనదైన శైలిలో ఎమోషన్స్, సామాజిక అంశాలు, తాత్విక ప్రశ్నలను సందించాడని ఆడియన్స్ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు, రక్తసంబంధాలు వంటి సున్నితమైన అంశాలను కథలో భాగంగా చూపిస్తూ ప్రేక్షకుడిని ఆలోచింపజేసే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఈ సినిమాకు సత్యదేవ్ నటన ప్రధాన బలంగా నిలిచిందని, 60 ఏళ్ల వృద్ధుడు రామప్ప పాత్రలో ఆయన చూపించిన హావభావాలు, భావోద్వేగాలు, అంతర్మథనాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

Also Read : మైథికల్ థ్రిల్లర్ ‘నాగబంధం’ రివ్యూ.. 

ముఖ్యంగా వృద్ధాప్యంలోని ఒంటరితనం, బాధ, ప్రేమ, జ్ఞాపకాల మధ్య సాగే సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకు ప్రాణం పోసిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు రాసుకున్న స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగినప్పటికీ, పాత్రల భావోద్వేగాలను లోతుగా ఆవిష్కరించే ప్రయత్నం కనిపిస్తుందని అంటున్నారు. భావోద్వేగాలు, జీవిత సత్యాలు, సామాజిక అంశాలను లోతుగా స్పృశించే ఓ విభిన్నమైన సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’ అని రివ్యూలు ఇస్తున్నారు.

ఓ నెటిజన్ తన రివ్యూ షేర్ చేస్తూ.. "‘రావు బహదూర్’ కేవలం సినిమా మాత్రమే కాదు.. ప్రేక్షకుడిని భావోద్వేగాల ప్రయాణంలో తీసుకెళ్లే ఓ ప్రత్యేక అనుభూతి. కథ మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిని నిలబెడుతుంది. రాజసపు నేపథ్యం, పీరియడ్ సెట్టింగ్‌ను అద్భుతంగా చూపించారు. నటీనటుల అద్భుతమైన ప్రదర్శన, ఆకట్టుకునే విజువల్స్ ప్రతి సన్నివేశాన్ని మరింత ప్రభావవంతంగా మార్చాయి. మొత్తంగా అన్ని వయసుల ప్రేక్షకులు తప్పక చూడాల్సిన ఎంటర్‌టైనర్." అని రాసుకొచ్చారు. 

మరొక నెటిజన్ మాట్లాడుతూ.. ‘‘వెంకటేష్ మహా తీసుకున్న ఈ బోల్డ్, యూనిక్ ప్రయత్నం తన అంబిషన్‌ను పూర్తిగా న్యాయపరచలేకపోయింది. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా పేషెన్స్‌ని పరీక్షించేలా ఉండి ప్రధానంగా సెటప్‌కే పరిమితమవుతుంది. సెకండ్ హాఫ్‌లో డ్రామా మెరుగై, క్లైమాక్స్ ఆసక్తికరంగా అనిపించినా, నేరేషన్ చాలా ల్యాగ్‌గా, అవసరానికి మించి పొడవుగా సాగుతుంది.

సోషల్ కామెంటరీకి మంచి అవకాశం ఉన్నా, అది డ్రామాలోనే కలిసిపోయి బలమైన ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. సత్యదేవ్ మాత్రం తన అద్భుతమైన నటనతో సినిమాకి హైలైట్‌గా నిలుస్తాడు. వెంకటేష్ మహా ఒక కొత్త ఐడియాతో ఆకట్టుకున్నా, అతిగా సెల్ఫ్-ఇండల్జెంట్‌గా మారడంతో సినిమా తన బలం కోల్పోతుందని’’ చెప్పుకొచ్చారు.