వాంకోవర్: ఈ వరల్డ్ కప్‌లో స్విట్జర్లాండ్ కూడా జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రౌండ్–32 మ్యాచ్‌లో 2–0తో అల్జీరియాపై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. మ్యాచ్ ప్రారంభమైన మొదటి 10 నిమిషాల పాటు అల్జీరియా జట్టు మైదానంలో ఆధిపత్యం చెలాయించింది. అయితే స్విస్ యువ సంచలనం జోహన్ మంజంబి కుడి వైపు నుండి వేగంగా దూసుకొచ్చి అందించిన అద్భుత పాస్‌ను బ్రీల్ ఎంబోలో గోల్‌గా మలిచాడు. దాంతో స్విట్జర్లాండ్‌కు 1–0 ఆధిక్యం లభించింది.
ఎంబోలోకు అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 26వ గోల్ కావడం విశేషం. సెకండాఫ్ ప్రారంభమైన మొదటి నిమిషంలోనే స్విట్జర్లాండ్ రెండో గోల్ కొట్టి అల్జీరియాను కోలుకోలేని దెబ్బకొట్టింది. డాన్ ఎన్డోయ్ (46వ ని) పెనాల్టీ బాక్స్ వెలుపల నుండి కొట్టిన బుల్లెట్ లాంటి షాట్‌ను అల్జీరియా గోల్‌కీపర్ లూకా జిదాన్ ఏమాత్రం అడ్డుకోలేకపోయాడు.
దీంతో స్విస్ జట్టు 2–-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆట 81వ నిమిషంలో ఫాబియన్ రీడర్ మరో గోల్ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. 2014 తర్వాత తొలిసారి వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన అల్జీరియా ప్రయాణం ఓటమితో టోర్నీని ముగించింది.
