Bigg Boss Telugu 10: ఏడో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. హౌస్ నుంచి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అవుట్?

Bigg Boss Telugu 10: ఏడో వారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. హౌస్ నుంచి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అవుట్?

బిగ్‌బాస్ తెలుగు 10లో ఏడో వారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది. హౌస్‌లో ఎవరు ఉంటారు? ఎవరి ప్రయాణం ముగుస్తుంది? అనే చర్చల మధ్య ఓ కంటెస్టెంట్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దక్షి ఎలిమినేషన్ డేంజర్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె హౌస్‌ను వీడబోతున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

12 మంది నామినేషన్స్.. 

ఏడో వారం నామినేషన్స్‌లో రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, శ్వేతా నాయుడు, వర్షిణి, టెంపర్ వంశీ, సుధీర్, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్ ఉన్నారు. వీరిలో రోహిత్, త్రిగుణ్, అమన్, రామకృష్ణకు మంచి ఓటింగ్ వస్తున్నట్లు సమాచారం. సింగర్ ఝాన్సీ, టెంపర్ వంశీ, వర్షిణి, సుధీర్ కూడా గట్టి పోటీనిస్తున్నారు. మరోవైపు శ్వేతా నాయుడు, నీతూ, దక్షి, శివలు డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ఓటింగ్ అంచనాలు చెబుతున్నాయి. అయితే నీతూ మాస్టర్ టాస్కుల్లో విజయం సాధించి ఎలిమినేషన్‌తో పాటు వచ్చే వారం నామినేషన్స్ నుంచి కూడా సేఫ్ అయినట్లు తెలుస్తోంది.

దక్షికి షాక్..?

లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్‌లో దక్షికి తక్కువ ఓట్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఏడో వారం ఆమె ఎలిమినేట్ కావచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌లోకి అడుగుపెట్టిన దక్షి, కేవలం రెండు వారాలకే బయటకు వెళ్లాల్సి వస్తుందా? అనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. గ్లామర్‌తో పాటు తనదైన ఆటతీరుతో గుర్తింపు తెచ్చుకోవాలని హౌస్‌లోకి వచ్చిన దక్షి, ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయిందనే చర్చ కూడా వినిపిస్తోంది. 

సింగిల్ ఎలిమినేషనా.. డబుల్ ఎలిమినేషనా?

ప్రస్తుతం హౌస్‌లో 17 మంది కంటెస్టెంట్లు ఉన్న నేపథ్యంలో ఈ వారం ఒక్కరే బయటకు వెళ్తారా? లేక డబుల్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ మరో షాక్ ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. దక్షి ఎలిమినేషన్‌పై వస్తున్న వార్తలు నిజమవుతాయా? చివరి నిమిషంలో ఓటింగ్ ఫలితాలు మారతాయా? అనేది అధికారిక ఎపిసోడ్‌లోనే తేలనుంది.