Bigg Boss 10 Host : బిగ్‌బాస్ 10లో ఊహించని బిగ్ ట్విస్ట్.. హోస్ట్‌గా రమ్యకృష్ణన్ ఎంట్రీ!

Bigg Boss 10 Host :  బిగ్‌బాస్ 10లో ఊహించని బిగ్ ట్విస్ట్.. హోస్ట్‌గా రమ్యకృష్ణన్ ఎంట్రీ!

బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న బిగ్‌బాస్  తమిళ్10లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు తనదైన శైలిలో షోను నడిపిస్తూ, కంటెస్టెంట్ల ఆటతీరుపై తనదైన విశ్లేషణతో ఆకట్టుకుంటున్న హోస్ట్ విజయ్ సేతుపతికి ఈ వారం బ్రేక్ పడింది. ఆయన స్థానంలో సీనియర్ నటి రమ్యకృష్ణన్ హోస్ట్‌గా రంగంలోకి దిగనున్నట్లు విడుదలైన ప్రోమో వీడియో ఆసక్తిని పెంచుతోంది. దీంతో ఈ వీకెండ్ ఎపిసోడ్ ఎలా ఉండబోతోందన్న చర్చ ప్రేక్షకుల్లో మొదలైంది.

విజయ్ సేతుపతికి విరామమా?

బిగ్‌బాస్ తమిళ్10 ప్రస్తుతం ఆరో వారంలోకి చేరుకుంటోంది. గత రెండు వారాలుగా విజయ్ సేతుపతి ఆరోగ్యం సరిగా లేకపోవడంతోనే ఈ వారం ఆయన స్థానంలో రమ్యకృష్ణన్ బాధ్యతలు చేపడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు, రమ్యకృష్ణన్ ఎంట్రీతో కంటెస్టెంట్లకు ఎలాంటి ప్రశ్నలు ఎదురుకానున్నాయి? ఆమె తనదైన స్టైల్‌లో ఎవరికి క్లాస్ పీకనున్నారు? అనే ఆసక్తి నెలకొంది.

బిగ్‌బాస్ హౌస్‌లో కొత్త రూల్స్..

ఈ సీజన్‌లో టాస్కులు మరింత కఠినంగా మారాయని బిగ్ బాస్ అభిమానులు చర్చించుకుంటున్నారు. సాధారణంగా చివరి రోజుల్లో మాత్రమే తీవ్రమైన పోటీలు కనిపిస్తుండగా, ఈసారి ప్రతిరోజూ కంటెస్టెంట్లకు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇక ఎప్పటిలా ఒకవైపు ఆడే టీమ్, మరోవైపు ప్రత్యర్థి టీమ్ అనే పాత విధానానికి బదులుగా ఈ వారం ఎరుపు, నీలం రంగుల జట్లుగా విభజించి పోటీలు నిర్వహిస్తున్నారు.

ఈ మార్పులు హౌస్‌లో సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశముంది. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న కంటెస్టెంట్లకు రమ్యకృష్ణన్ ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్నారు? విజయ్ సేతుపతి తిరిగి ఎప్పుడు హోస్ట్‌గా కనిపిస్తారు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రమ్యకృష్ణన్ హోస్టింగ్‌తో ఈ వారం బిగ్‌బాస్‌కు కొత్త ఊపు వస్తుందా? అనేది చూడాలి..