ఖమేనీ అంత్యక్రియలు షురూ... టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని గ్రాండ్ మొసల్లా గ్రౌండ్లో సంతాప కార్యక్రమాలు

ఖమేనీ అంత్యక్రియలు షురూ... టెహ్రాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని గ్రాండ్ మొసల్లా గ్రౌండ్లో సంతాప కార్యక్రమాలు
  • ప్రజల సందర్శనార్థం నేడు, రేపు మైదానంలోనే భౌతికకాయం
  • నాలుగో రోజు ప్రారంభం కానున్న మహా అంతిమయాత్ర
  • పవిత్ర నగరం కోమ్​కు ఖమేనీ పార్థివదేహం తరలింపు

టెహ్రాన్: ఇరాన్ దేశ మాజీ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ(86 )కి తుది వీడ్కోలు పలికేందుకు ఇస్లామిక్ రిపబ్లిక్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం ఆయన అంత్యక్రియల ప్రక్రియ ప్రారంభమైంది. ఇది ఈ నెల 9వ తేదీ వరకు(ఆరో రోజులు) ఇరాన్, ఇరాక్ దేశాల్లోని ఐదు ప్రధాన నగరాల్లో కొనసాగనుంది. ఇది ఇరాన్ చరిత్రలోనే అత్యంత పెద్ద అంత్యక్రియల ప్రక్రియగా నిలవనుంది.

దాదాపు 37 ఏండ్ల పాటు ఇరాన్‌ను శాసించిన ఖమేనీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 28న మరణించారు. టెహ్రాన్‌‌లోని నివాసంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు జరిపిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం వల్ల వాయిదా పడుతూ వచ్చిన అంత్యక్రియల ప్రక్రియ శుక్రవారం స్టార్ట్ అయింది.

అంత్యక్రియల షెడ్యూల్ ఇదే..

ఇరాన్ ప్రభుత్వం ఖమేనీ అంత్యక్రియలను తమ దేశ ఐకమత్య బలానికి ప్రతీకగా నిర్వహిస్తోంది. ఈ అంత్యక్రియల కోసం ఇరాన్ "వియ్ మస్ట్ రైస్(మనం ఎదురు తిరగాలి)" అనే నినాదాన్ని ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. జులై 3 శుక్రవారం టెహ్రాన్‌‌లోని 'గ్రాండ్ మొసల్లా' మైదానంలో విదేశీ ప్రముఖుల సమక్షంలో సంతాప కార్యక్రమాలు మొదలయ్యాయి. ఖమేనీ శవపేటికపై ఇరాక్ కర్బలాలోని ఇమామ్ హుస్సేన్ పుణ్యక్షేత్రానికి చెందిన పవిత్రమైన ఎరుపు రంగు జెండా(త్యాగానికి, ప్రతీకారానికి చిహ్నం)ను కప్పారు. జూలై 4, 5 తేదీల్లో ప్రజల సందర్శనార్థం భౌతికకాయాన్ని అక్కడే ఉంచుతారు. 

జూలై 6, 7 తేదీల్లో అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది.భౌతికకాయం మొదట పవిత్ర నగరమైన కోమ్‌కు చేరుకుంటుంది. 8న భౌతికకాయాన్ని ఇరాక్‌‌లోని కర్బలా, నజాఫ్ నగరాలకు తీసుకెళ్తారు. 9న ఖమేనీ సొంత ఊరైన ఇరాన్ మష్హాద్ నగరంలోని ఇమామ్ రెజా పుణ్యక్షేత్రంలో ఆయనను ఖననం చేస్తారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అంత్యక్రియల కోసం దేశ చరిత్రలోనే అత్యంత భారీ భద్రతా, రవాణా ఏర్పాట్లను ఇరాన్ ప్రభుత్వం చేపట్టింది. అంత్యక్రియల రోజుల్లో దేశంలోని అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలన్నింటినీ పూర్తిగా మూసివేశారు. ప్రజల కోసం 700కి పైగా కొత్త పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సెలవులు ప్రకటించారు. వ్యాపార సంస్థలు మూసివేయాలని, ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా సంతాప సభల్లో పాల్గొనాలని ఆదేశాలిచ్చారు. అంత్యక్రియలప్పుడు శత్రు దేశాలు ఎలాంటి దాడులకు పాల్పడినా ఊరుకునేది లేదని హెచ్చరించింది.

ఇంత ఆలస్యమెందుకంటే..!

అమెరికా, ఇజ్రాయెల్‌‌లతో ఇరాన్ జరిపిన యుద్ధం, నిరంతర బాంబు దాడుల వల్లే ఇంత ఆలస్యం జరిగిందని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇస్లాం ప్రకారం.. డెడ్ బాడీకి కెమికల్స్ పూయడం నిషిద్ధం. షియా చట్టాల ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహాయింపులు ఉంటాయి. అందువల్ల ఖమేనీ భౌతికకాయాన్ని ఇన్నాళ్లూ కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థలోనే భద్రపరిచినట్లు ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. మతపరమైన, చట్టపరమైన నిబంధనలకు లోబడే శరీరాన్ని కాపాడినట్లు పేర్కొన్నారు.

2 కోట్ల మంది హాజరవుతారని అంచనా

ఖమేనీ అంత్యక్రియలకు 2 కోట్ల మంది హాజరవుతారని అధికారులు అంచనా. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్, చైనా ప్రతినిధులు హాజరవుతున్నారు. భారతదేశం తరపున బిహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్, కేంద్ర మంత్రి పబిత్రా మార్గరీటా, కాంగ్రెస్ నేతలు సల్మాన్ ఖుర్షీద్, జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ టెహ్రాన్ చేరుకున్నారు. మొదటి రోజు అంత్యక్రియల కార్యక్రమానికి ప్రస్తుత సుప్రీం లీడర్‌‌ మొజ్తబా భద్రతా కారణాలవల్ల హాజరు కాలేదని ఇరాన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.