కీవ్: మిట్టల్ ఫ్యాక్టరీపై రష్యా మిసైల్దాడి.. ఇద్దరు ఉద్యోగులు మృతి, 14 మందికి గాయాలు

కీవ్: మిట్టల్ ఫ్యాక్టరీపై రష్యా మిసైల్దాడి.. ఇద్దరు ఉద్యోగులు మృతి, 14 మందికి గాయాలు

కీవ్: భారత సంతతి  బిలియనీర్ లక్ష్మీ మిట్టల్‌‌‌‌కు ఉక్రెయిన్‌‌‌‌లో ఉన్న ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌‌‌‌పై రష్యా క్షిపణులతో దాడి చేసింది. క్రైవీ రిహ్ సిటీలో ఉన్న ఆర్సెలార్ మిట్టల్ మైనింగ్, మెటలర్జికల్ ప్లాంట్‌‌‌‌ను లక్ష్యంగా చేసుకుని ఈ అటాక్ జరిపింది. ఈ దాడిలో ప్లాంట్‌‌‌‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14మంది తీవ్రంగా గాయపడ్డారు. 

సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్‌‌‌‌కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మిస్సైల్‌‌‌‌ అటాక్‌‌‌‌తో ఫ్యాక్టరీ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.