హైదరాబాద్ సిటీ, వెలుగు: నకిలీ వస్తువులను గుర్తించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధకులు ‘పాలెన్‌సిగ్నమ్’ అనే పుప్పొడి ఆధారిత నానో-ఆప్టికల్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు.
డా.ఎ. విజయ భాస్కర్ రెడ్డి, డి. నిర్మల, బి. విజయ్ కుమార్ రూపొందించిన ఈ సాంకేతికత ద్వారా కరెన్సీ, భద్రతా పత్రాలు, ఔషధాలు, ఆభరణాల ప్రామాణికతను నిర్ధారించవచ్చు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన భారత పేటెంట్ దరఖాస్తును ఈ నెల 2న ప్రచురించారు.
