వరల్డ్ స్కిల్స్ పోటీల్లో హైదరాబాదీ ప్రతిభ

వరల్డ్ స్కిల్స్ పోటీల్లో హైదరాబాదీ ప్రతిభ
  • కేశోజు యశ్వంత్ చారికి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ అవార్డు

పద్మారావునగర్, వెలుగు: చైనాలోని షాంఘై నగరంలో జరిగిన 47వ వరల్డ్ స్కిల్స్ పోటీల్లో హైదరాబాద్‌‌కు చెందిన కేశోజు యశ్వంత్ చారి ప్రతిభ కనబరిచి మెడల్ ఫర్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు. క్యాబినెట్ మేకింగ్ (చెక్క పనితనం) విభాగంలో ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించి, 80కి పైగా దేశాల నిపుణులతో పోటీపడి తన సాంకేతిక పరిజ్ఞానం, కచ్చితమైన నైపుణ్యాలతో అంతర్జాతీయ న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నాడు.

నేషనల్ కాంపిటీషన్‌‌లో గోల్డ్​మెడల్​సాధించడం ద్వారా అర్హత పొందిన యశ్వంత్ చారి, దక్షిణ కొరియాతోపాటు వివిధ బూట్ క్యాంప్‌‌లలో శిక్షణ పొంది, మైక్రో ప్రిసిషన్ వుడ్‌‌ వర్కింగ్‌‌లో నైపుణ్యం సాధించాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి ప్రాతినిధ్యం వహించి, ఈ గౌరవం పొందడం ఎంతో గర్వంగా ఉందన్నాడు.