ముంబై: ఇజ్రాయెల్ వెళ్తున్న విమానాన్ని కూల్చేయడానికి కో పైలట్ చేసిన కుట్రను భగ్నం చేసిన ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ సాహసాన్ని ఇజ్రాయెల్ దేశం అరుదైన రీతిలో కొనియాడింది. ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సులేట్ జనరల్ శుక్రవారం నగరంలో ఆయన ఫొటోతో భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేసింది.
భారత్‌కు ఒక కొత్త హీరో దొరికాడు. ఇజ్రాయెల్ ఎప్పటికీ ఆయన పేరును మర్చిపోదు అంటూ ముంబైలోని ఇజ్రాయెల్ కాన్సుల్ జనరల్ యానివ్ రెవాచ్ ‘ఎక్స్’ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన కెప్టెన్ స్మిత్‌కు ధన్యవాదాలు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటుఈన్నాం’ అనే మెస్సేజ్‌తో కూడిన ఆ బిల్ బోర్డ్ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
