ఇరాన్: హార్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికాకు చెందిన లూకాస్ అనే అటాక్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ (ఐఆర్ఐబీ) కథనం ప్రకారం.. వ్యూహాత్మక జలమార్గంపై ప్రయాణిస్తున్న ఈ డ్రోన్‌ను ఇరాన్వైమానిక రక్షణ వ్యవస్థ గుర్తించి ధ్వంసం చేసింది. అంతకుముందు ఖేష్మ్ ద్వీపం దక్షిణ ప్రాంతంలో యూఎస్ ఎంక్యూ-1 ప్రిడేటర్ డ్రోన్‌ను కూల్చినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్కార్ప్స్(ఐఆర్జీసీ) తెలిపింది.
మరోవైపు, బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్‌బేస్‌లోని యూఎస్ రాడార్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను అమెరికా సైన్యం మధ్యలోనే అడ్డుకుంది. ఎలాంటి ప్రాణనష్టం లేదా పరికరాలకు నష్టం జరగలేదని అమెరికా ప్రకటించింది. ఈ వరుస పరిణామాలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.
