హైదరాబాద్ లో జనం ఎక్కువ. లిక్కర్ షాపులు ఎక్కువ. అంటే మందు వాడకం కూడా ఎక్కువే అనుకుంటారు కదా. కానీ ఆ ఆలోచన తప్పు అని లేటెస్టు సర్వే ద్వారా వెల్లడైంది. మందు వాడకంలో హైదరాబాద్ సిటీ దాదాపు అట్టడుగున ఉండటం ఆశ్చర్యకరమైన విషయం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే6 ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ లో మొత్తం 600 లిక్కర్ షాపులు ఉన్నప్పటికీ.. లిస్టులో మాత్రం 31వ స్థానంలో ఉంది. అంటే కింది నుంచి థర్డ్ ర్యాంకు లో ఉంది సిటీ. సర్వే ప్రకారం.. తెలంగాణలో అతి తక్కువ మద్యం వినియోగం ఉన్న జిల్లాలు ఆదిలాబాద్ (27.4 శాతం), కుమురం భీమ్ అసిఫాబాద్ (30.1 శాతం).
టాప్ లో ఉన్న జిల్లాలు ఇవే..
సర్వే ప్రకారం.. సిటీల కంటే రూరల్ ప్రాంతాల్లోనే మద్యం వినియోగం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయింది. జనగాం జిల్లా 61.6 శాతం మద్యం వినియోగంతో మొదటి స్థానంలో ఉంది. అంటే జనగాం జిల్లాలో మందు ఎక్కువగా తాగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక 56.6 శాతం వాడకం తో జయశంకర్ భూపాలపల్లి రెండో స్థానంలో, 56.5 శాతం మందు వాడకంతో వరంగల్ రూరల్ మూడో స్థానంలో ఉంది.
సిటీలో వాడకం తక్కువ..
అర్బన్ ఏరియాలో మద్యం వాడకం తక్కువగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో 600 వందల షాపులు ఉన్నప్పటికీ.. కేవలం 13.5 శాతం మద్యం వాడకంతో అట్టడుగున ఉన్నట్లు తేలింది. తెలంగాణ మొత్తం యావరేజ్ మద్యం వినియోగం 44 శాతం ఉండగా.. హైదరాబాద్ చాలా తక్కువ శాతం వినయోగంతో చివరి నుంచి 3వ స్థానంలో ఉంది.
ఇక దేశ వ్యాప్తంగా ఉన్న సిటీలతో పోల్చితే కూడా హైదరాబాద్ లో వినియోగం తక్కువే ఉంది. దేశవ్యాప్తంగా సిటీలో ఆల్కహాల్ వినియోగం సరాసరి 18.9 శాతం ఉండగా.. హైదరాబాద్ లో వినియోగం 11.5 శాతం ఉన్నట్లు వెల్లడైంది.
తెలంగాణలో మొత్తం 2620 A4 రిటైల్ లిక్కర్ షాపులు ఉండగా.. 1107 2B బార్లు, 88 ఎలైట్ బార్లు ఉన్నాయి.
రాష్ట్రాల వారిగా తెలంగాణ టాప్:
ఇక దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలతో పోల్చితే మందు వాడకంలో తెలంగాణ టాప్ లో ఉంది. రాష్ట్రంలో 44 శాతం మంది పురుషులు మందు తాగుతున్నారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో మందు వినియోగం ఎక్కువగా ఉండటంతోనే దేశంలోనే అత్యధికంగా మద్యం వినియోగం ఉన్న రాష్ట్రంగా రికార్డు సృష్టించింది. మరో విషయం ఏంటంటే మన రాష్ట్రంలో 15 ఏళ్ల బాలురు కూడా మద్యం తాగుతున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో 15-49 ఏళ్ల వయసున్న పురుషులు 50 శాతం మంది ఆల్కహాల్ తాగుతున్నట్లు గత రిపోర్టు ఆధారంగా తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా 22.4 శాతం మద్యం తాగేవారుండగా.. తెలంగాణలో 50 శాతం మంది ఈ వయసులో తాగే వాళ్లు ఉండటం గమనార్హం.
దేశ వ్యాప్తంగా తెలంగాణ తర్వాత అత్యధికంగా మందు వాడుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. 42.2 శాతం ఇక్కడ ఆల్కహాల్ కంజప్షన్ ఉంది. ఆ తర్వాతి స్థానంలో ఛత్తీస్ గఢ్ (38.3) ఉంది.
మహిళల మద్యం వినియోగం
తెలంగాణలో మద్యం వినియోగంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంది. రూరల్ తెలంగాణలో 8.6 శాతం మహిళలు మద్యం తీసుకుంటున్నారు. అదే సమయంలో అర్బన్ ఏరియాల్లో అంటే టౌన్స్, సిటీల్లో 2.8 శాతం వరకు మాత్రమే మందు ముట్టేవాళ్లు ఉన్నారు.
ఇక తెలంగాణలో 2025-26 లో 40వేల 209 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. గత ఏడాది 37వేల 487 కోట్ల రూపాయలు మందు అమ్ముడుపోయింది.
