పితృపక్షాలు: ఎన్ని తరాల వారికి తర్పణాలు వదలాలి.. పిండప్రదానం ఎవరికి చేయాలి.. గరుడపురాణంలో ఏముంది.!

పితృపక్షాలు:  ఎన్ని తరాల వారికి తర్పణాలు వదలాలి.. పిండప్రదానం ఎవరికి చేయాలి.. గరుడపురాణంలో ఏముంది.!

 హిందువుల ఆచారం ప్రకారం.. మహాలయ పక్షాల 15 రోజులు పితృదేవతలకు చాలా పవిత్రమైనవి.  ప్రస్తుతం ( అక్టోబర్​3వ తేదీనాటికి) మహాలయ పక్షాలు ప్రారంభమై ఏడు రోజులైంది.  బాధ్రపదమాసం అమావాస్యతో ( అక్టోబర్​ 10) వ తేదీ నాటికి ముగుస్తాయి.  ఆ రోజున  మహాలయపక్షాల్లో ఎవరెవరికి అన్నం పెట్టాలి.. తర్పణాలు వదలాలి.. పిండ ప్రదానం ఎవరికి చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. 

 గరుడ పురాణం  గయలో  పితృదేవతలకు పిండదానం చేయడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇక్కడ పిండదానం చేయడం ద్వారామరణించిన వారి ఆత్మ సంతృప్తి చెందుతుందని పండితులు చెబుతున్నారు.

  • 1) పితరం..(తండ్రి )
  • 2) పితామహం..(తాత)
  • 3) ప్రపితామహం..(ముత్తాత) 
  • 4) మాతరం ..(తల్లి) 
  • 5) పితామహీం.. (నానమ్మ) 
  • 6) ప్రపితామహీం ..(నానమ్మ గారి అత్త) 
  • 7) సాపత్నిమాతరం ..(సవితి తల్లి) 
  • 8) మాతామహం.. (తాత.. తల్లి గారి తండ్రి)
  • 9) మాతుః పితామహం ..(తల్లి గారి తాత) 
  • 10) మాతుః ప్రపితామహం.. (తల్లి  తాతగారి తండ్రి) 
  • 11) మాతామహీం..(అమ్మ మ్మ)
  • 12) మాతుః పితామహీం.. (తల్లి  నానమ్మ) 
  • 13) మాతుః ప్రపితామహీం.. (తల్లి  నానమ్మ గారి అత్త) 
  • 14) ఆత్మ పత్నీం (భార్య).. .
  • 15) సుతం (కుమారుడు) 
  • 16) జ్యేష్ఠ భ్రాతరం (స్వంత సోదరుడు)
  • 17) కనిష్ఠ భ్రాతరం 
  • 18) తతృత్నీం (సోదరుని భార్య.. వదిన) 
  • 19) పితృవ్యం (పెదనాన్న/చిన్నాన్న) 
  • 20) తత్పత్నీం.. (పెద్దమ్మ/ చిన్న మ్మలు).
  • 21) తత్ పుత్రం (పెదనాన్న & చిన్నాన్న కుమారుడు.. )
  • 22) తత్పత్నీం (పెదనాన్న చిన్నాన్న కుమారుని భార్య)
  • 23) మాతులం (మేనమామ.. తల్లి సోదరుడు) 
  • 24) తత్పత్నీం (మేనమామ భార్య) 
  • 25) ఆత్మ భగినీం (సోదరి, అక్క &చెల్లెలు) 
  • 26) తద్భర్తారం (కూతురి భర్త & అల్లుడు) 
  • 27) దౌహిత్రం (కూతురి కొడుకు & మనుమడు) 
  • 28) తత్పత్నీం (కూతురు.. కొడుకు భార్య) 
  • 29) భాగినేయకం (మేనల్లుడు) 
  • 30) తత్పత్నీం (మేనల్లుడి భార్య) 
  • 31) పితృ భగినీం (మేనత్త & తండ్రి సోదరి) 
  • 32) తద్భర్తారం (మేనత్త భర్త) గోత్రం.. 
  • 33) మాతృ భగినీం (తల్లి సోదరి.. చిన్న మ్మ. పెద్దమ్మ) 
  • 34) తద్భర్తారం (తల్లి సోదరి  ..భర్త) 
  • 35) జామాతరం ( అల్లుడు ..కూతురి భర్త) 
  • 36) స్నుషాం (కోడలు) 
  • 37) శ్వశురం (పిల్లనిచ్చిన మామ..) 
  • 38) శ్వశ్రూం (పిల్లనిచ్చిన మామ భార్య.. అత్తగారు) 
  • 39) శ్యాలకం (బావమరిది) 
  • 40) తతృత్నం (బావమరిది భార్య)
  • 41) ఆత్మ పత్నీం (భార్య) గోత్రాం... 
  • 42) గురుం .. ( గురువుగారు)
  • 43) రిజ్ఞానం .. ( ఇతర బంధువులు, స్నేహితులు)
  • 44) జగద్గురువు కంచి కామకోటి పీఠాధిపతులు

గమనిక:  మరణించిన  వారికి మాత్రమే పిండ ప్రదానం చేయాలి.  అలాగే  తండ్రి జీవించి ఉండి.. తల్లి కాలం చేసిన ఎడల... అలాంటి వారు ఒక్క తల్లికి మాత్రమే  తర్పణాలు వదలాలి.  ఆడ పిల్లలు మాత్రమే ఉండి వారి తల్లి దండ్రులు మరణించిన ఎడల పెద్ద కుమార్తె మొదటి కుమారుడు ( దౌహోత్రుడు) అమ్మమ్మ.. తాతయ్యలకు  కేవలం తర్పణాలు మాత్రమే వదలాలి. పిండ ప్రదానం చేయరాదు.. ఒకవేళ అలాంటి సందర్భంలో కార్యక్రమం చేసే వ్యక్తికి తండ్రి జీవించి లేకపోతే ... పిండ ప్రదానం కూడా చేయవచ్చని పండితులు చెబుతున్నారు. 

మనం తెలిసో.. తెలియకో... కొంతమందికి ఆబ్ధికాలు ( తద్దినాలు) పెట్టము.  అలాంటి వారు బాధ్రపద మాసం అమావాస్య రోజు ( అక్టోబర్​ 10)న పూర్వీకులను యథావిథిగా పూజించి... తర్పణాలు వదలితే అంతటి ఫలితం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. 

మహాలయ పక్షాల రోజుల్లో  పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చడానికి ఆయా వంశీకులు తర్పణాలు, శ్రాద్ధ కర్మలు, దానధర్మాలు చేయాలి. ఈ సమయంలో పితృదేవతలను సంతృప్తి ప‌ర‌చ‌డంతో పాటు ఇంట్లో ప్రతికూల‌త‌ల‌ను తొలగుతాయని పండితులు చెబుతున్నారు.  

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.