భారత ఎన్నికల వ్యవస్థపై అమెరికా ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు నిబంధనలు కఠినతరం చేసేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్.. ఆ విషయంలో ఇండియాను చూసి నేర్చుకోవాల్సిందేనని అన్నారు. ఎన్నికల గుర్తింపు కార్డు విషయంలో ఇండియా అనుసరిస్తున్న విధానం బాగుందంటూ కితాబిచ్చారు. ఈ మేరకు సోమవారం (ఆగస్టు 17) ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు.
అమెరికన్ ఓటర్ ఎలిజిబిటీ (సేవ్) అమెరికా యాక్ట్ ను కఠినతరం చేసే విషయంలో ఇండియాను అనుసరించాలని అన్నారు. అమెరికా ఎన్నికల్లో కఠిన పౌరసత్వం అమలు చేయాలంటే ఈ మేరకు మార్పులు తప్పనిసరి అని తెలిపారు.
ఇటీవల భారత ఎన్నికల సంఘం ఛైర్మన్ జ్ఞానేశ్ కుమార్ తో జరిపిన సంభాషణ గుర్తుచేశారు. యూఎస్ ఎన్నికల్లో ఫోటో గుర్తింపు కార్డు లేకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించినట్లు చెప్పారు. ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా ఫోటో ఐడీ తప్పనిసరి చేయాలని సూచించారని అన్నారు. ఇండియాలో అమలు చేస్తున్న ఫోటో ఎలక్ట్రిక్ ఐడెంటిటీ కార్డు గురించి చెప్పినట్లు తెలిపారు.
ఇండియాలో ఒక్క శాతం పోస్టల్ బ్యాలెట్ కు కూడా ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్ వినియోగించినట్లు ట్రంప్ చెప్పారు. ఇండియాలో గత ఎన్నికల్లో 64 కోట్ల 6 0 లక్షల మంది పాల్గొంటే అందులో ఒక్క శాతం మాత్రమే పోస్టల్ బ్యాలెట్, ఈమెయిల్ వాడారని.. అవి కూడా ఫోటో ఐడెంటిటీతో వేసినవేనని జ్ఞానేశ్ కుమార్ చెప్పినట్లు తెలిపారు. అమెరికాలో ఈమెయిల్ ద్వారా ఓట్లు వేసే పద్ధితిని తగ్గించాల్సి ఉందని ఈ సందర్భంగా అన్నారు. అమెరికాలో ఓటు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సిటిజన్ షిప్ ప్రూఫ్ చూపించాల్సిందేనని అన్నారు.
ట్రంప్ వాదనను ఇండియాలో అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్ సమర్ధించారు. సేవ్ అమెరికా యాక్ట్ కోసం ట్రంప్ చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు. 2024 లో ఇండియా జనరల్ ఎలక్షన్స్ లో ఓటర్ ఆథెంటికేషన్ విషయంలో ఇండియా బెంచ్ మార్క్ క్రియేట్ చేసినట్లు కొనియాడారు.
Earlier this month, India’s Chief Election Commissioner, Gyanesh Kumar, asked our Administration — How can you have Elections in the U.S. without a valid Photo ID? India’s last Election had 646,000,000 Voters! Less than 1% voted by mail, and every single Voter had to have a VALID… pic.twitter.com/dWtL287nkk
— Commentary Donald J. Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) August 17, 2026
