హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ను లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం..

హైదరాబాద్ పబ్లిక్కు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ను లాంచ్ చేసిన డిప్యూటీ సీఎం..

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో బస్సులు, మెట్రో రైళ్లలో వేర్వేరు టికెట్లు తీసుకునే పనిలేకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కామన్ పాస్ వచ్చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి కామన్ పాస్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామన్ పాస్లను కొనుగోలు చేశారు.

పాస్ ఛార్జీలు ఎలా ఉన్నాయంటే.. రోజువారీ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ ధర రూ.8,500. కోర్ అర్బన్ రీజియన్ (కూర్) పరిధిలోని ప్రయాణికుల కోసం ఈ కామన్ పాస్‌‌ను తీసుకొచ్చారు. అన్ని మెట్రో స్టేషన్లలో ఈ కార్డును జారీ చేస్తారు. మొదటి సారి కార్డు తీసుకున్నప్పుడు రూ.100 సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేస్తారు. కార్డు తిరిగి ఇచ్చేస్తే ఆ రూ.100 వాపస్ ఇస్తరు. ఔటర్ రింగ్ రోడ్ లోపల నడిచే అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సులు (పుష్పక్ ఏసీ మినహా), మూడు కారిడార్లలోని మెట్రో రైళ్లలో ఈ పాస్‌‌ పని చేస్తుంది.

మరోవైపు సిటీ బస్సుల్లో పేపర్‌‌లెస్ ప్రయాణం కోసం ‘మీ టికెట్’ యాప్ ప్రవేశపెట్టారు. ఈ యాప్​ ద్వారా ఓపెన్ టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రయాణికులు తమ ఫోన్ ద్వారా యాప్‌‌లోనే ఎక్కే స్టాప్, దిగే స్టాప్, టికెట్ రకాన్ని ఎంచుకుని డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేయవచ్చు. పేమెంట్ పూర్తి కాగానే యాప్‌‌లో డైనమిక్ క్యూఆర్ కోడ్ టికెట్ వస్తుంది. ప్రయాణ సమయంలో బస్సులో కండక్టర్‌‌కు ఆ డిజిటల్ క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది.

ఇదే ‘మీ టికెట్’ యాప్‌‌లో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రూ.600 డిజిటల్ వీక్లీ బస్ పాస్‌‌ను కూడా ప్రవేశపెట్టారు. ప్రయాణికులు ఇకపై బస్ పాస్ సెంటర్ల వద్ద క్యూలో నిలబడే అవసరం లేకుండా, నేరుగా యాప్ ద్వారానే రూ.600 చెల్లించి పాస్ తీసుకోవచ్చు. ఈ పాస్‌‌తో వారం రోజులపాటు అన్ని సిటీ బస్సుల్లో అపరిమిత ప్రయాణం చేయవచ్చు. ఈ యాప్‌‌లో వీక్లీ పాస్‌‌తోపాటు రోజువారీ, నెలవారీ పాసులు కూడా అందుబాటులో ఉంటాయి.