SIGMA Review: సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ రివ్యూ.. సీఎం విజయ్ కుమారుడి డైరెక్షన్ ఎలా ఉందంటే?

SIGMA Review: సందీప్ కిషన్ ‘సిగ్మా’ మూవీ రివ్యూ.. సీఎం విజయ్ కుమారుడి డైరెక్షన్ ఎలా ఉందంటే?

సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘సిగ్మా’ (SIGMA) మూవీ ఇవాళ (అక్టోబర్ 2, 2026న)  ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాను మైత్రి మేకర్స్, ఎన్‌‌‌‌వీఆర్ సంస్థలు తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి డైరెక్టర్‌గా జాసన్ ఎలా మెప్పించాడు? సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? సోషల్ మీడియాలో ఆడియన్స్ ఎలాంటి రివ్యూలు ఇస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం.

‘సిగ్మా’ కథేంటంటే:

సందీప్ కిషన్ ఇందులో గురు అనే యువకుడి పాత్రలో కనిపిస్తాడు. అప్పుల బాధల్లో ఉన్న గురు.. తన తల్లి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న లైబ్రరీని కాపాడుకోవడానికి డబ్బు సంపాదించాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో ఓ క్యాసినోలోకి వెళ్లడంతో అతడి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.

కథలో ప్రధానంగా రూ.500 కోట్ల మాఫియా డబ్బు, ఓ పెన్‌డ్రైవ్/కీ, దాన్ని దక్కించుకోవాలని ప్రయత్నించే పలు గ్యాంగ్‌ల చుట్టూ కథ సాగుతుంది. ట్రెజర్ హంట్, హీస్ట్, యాక్షన్, కామెడీ అంశాలను కలిపి జాసన్ సంజయ్ కథను ఎలా తెరకెక్కించాడనేదే మిగతా కథ. 

ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే:

అప్పుల్లో ఉన్న ఓ యువకుడు.. రూ.500 కోట్ల మాఫియా డబ్బు వ్యవహారంలో చిక్కుకోవడం, దాన్ని చేజిక్కించుకునే క్రమంలో ఎదురయ్యే సమస్యలు, యాక్షన్-కామెడీ-అడ్వెంచర్‌తో సాగే కథే ‘సిగ్మా. జాసన్ సంజయ్ చెప్పిన ప్రకారం, ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ‘సిగ్మా మూమెంట్’ ఉంటుంది. కష్టాల నుంచి బయటపడేందుకు మనిషి తీసుకునే కీలక నిర్ణయమే ఆ ‘సిగ్మా’ మూమెంట్ అనే కాన్సెప్ట్ చుట్టూ సినిమా కథను తెరకెక్కించారు.

ప్రస్తుతం వస్తున్న సోషల్ మీడియా రెస్పాన్స్ బట్టి చూస్తే ‘సిగ్మా’కు మిక్స్డ్ టాక్ వస్తోంది. సందీప్ కిషన్ యాక్షన్, కామెడీ, థమన్ సంగీతం, ఇంటర్వెల్ బ్లాక్, జాసన్ సంజయ్ డైరెక్షన్పై ప్రశంసలు వస్తున్నాయి. అయితే, జాసన్ సంజయ్ మేకింగ్పై ప్రశంసలు వస్తుండగా.. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కథ స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా సెట్ చేసుకుని ఉంటే.. జాసన్ ఎంట్రీ కంప్లీట్గా అదిరిపోయేదని ట్వీట్స్ పెడుతున్నారు. 

ఓ ఆడియన్ తన రివ్యూ షేర్ చేస్తూ.. ‘‘ సిగ్మా ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉందని తెలిపారు. డెబ్యూ ఫిల్మ్‌మేకర్‌గా జాసన్ సంజయ్ తనలో మంచి పొటెన్షియల్ ఉందని నిరూపించుకున్నాడని పేర్కొన్నారు. టెక్నికల్‌గా సినిమా బాగుందని, డైరెక్టర్ వెంకట్ ప్రభు తరహా హీస్ట్ థ్రిల్లర్స్ జోన్‌లో మూవీ సాగుతుందని అన్నారు. ఇప్పటివరకు సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగానే ఉందని తెలిపారు. ముఖ్యంగా థమన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ప్రశంసించారు. సందీప్ కిషన్ అండర్‌డాగ్ పాత్రకు పర్ఫెక్ట్‌గా సరిపోయాడని’’ పేర్కొన్నారు.

మరో ఆడియన్ ట్వీట్ చేస్తూ.. ‘‘సిగ్మా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించిందని పేర్కొన్నారు. సినిమా స్టార్టింగ్ లో పాత్రల పరిచయానికే దాదాపు 40 నిమిషాల సమయం తీసుకోవడంతో అక్కడ కాస్త ల్యాగ్ అనిపించిందని తెలిపారు. అయితే ఆ తర్వాత కథనం పుంజుకుని థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్తుందని, సస్పెన్స్‌ను బిల్డ్ చేస్తూ సినిమా ఆసక్తికరంగా మారుతుందని చెప్పారు. ఇంటర్వెల్‌కి వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుందని పేర్కొన్నారు.

దర్శకుడిగా జాసన్ సంజయ్ మేకింగ్ బాగుందని, అయితే కథ, స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త మెరుగ్గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సందీప్ కిషన్ తన పాత్రను చాలా సహజంగా, అద్భుతంగా క్యారీ చేశాడని ప్రశంసించారు. సినిమా క్రమంగా హీస్ట్ జానర్ వైపు వెళ్తుందని’’ తెలిపారు.

ప్రస్తుతం ‘సిగ్మా’పై సోషల్ మీడియాలో వస్తున్న స్పందన చూస్తే.. సినిమాకు మిక్స్‌డ్ టు పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. అయితే ఇవన్నీ ఫస్ట్ డే ఫస్ట్ షోలు చూసిన ప్రేక్షకుల అభిప్రాయాలే. సినిమా పూర్తి స్థాయి టాక్ ఏంటి? ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆదరించారు? జాసన్ సంజయ్ డైరెక్టర్‌గా ఎంతవరకు మెప్పించాడు? అన్నది తెలియాలంటే కాస్త సమయం వెయిట్ చేయాల్సిందే. ముఖ్యంగా ఒక రోజు పూర్తయ్యాక వచ్చే ఆడియన్స్ టాక్‌తో ‘సిగ్మా’ అసలు రిజల్ట్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఈ హీస్ట్ థ్రిల్లర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!