అత్తాకోడళ్ల మధ్య రోజూ గొడవలా ? ఇంట్లో ఈ మార్పులు చేయండి.. ప్రశాంతంగా, సంతోషంగా మారుతుంది!

అత్తాకోడళ్ల మధ్య రోజూ గొడవలా ? ఇంట్లో  ఈ మార్పులు చేయండి.. ప్రశాంతంగా, సంతోషంగా మారుతుంది!

మీ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య రోజూ గొడవలు జరుగుతున్నాయా.. ?  ఏం చేయాలో తెలియక విసిగిపోయారా..? అయితే మీ ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసి చూడండి.. మళ్లీ మీ ఇంట్లో ప్రశాంతత, సంతోషం తిరిగి వస్తాయి. ఈ రోజుల్లో అత్తాకోడళ్ల మధ్య చిన్న చిన్న గొడవలు సహజమే. కానీ, అవి పెరిగి పెద్దవైనప్పుడు ఇంట్లో అందరికీ మానసిక ఒత్తిడి  పెరుగుతుంది. ఇంటి ప్రశాంతత పాడవుతుంది. అయితే, ఈ గొడవలకు ఇంట్లోని వాస్తు దోషాలు కూడా ఒక కారణం కావచ్చని మీకు తెలుసా?

వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కుటుంబికుల మధ్య గొడవలు జరుగుతాయి. అలాంటప్పుడు కొన్ని చిన్న చిన్న వాస్తు చిట్కాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం:

అత్తాకోడళ్ల మధ్య గొడవలు తగ్గడానికి వాస్తు చిట్కాలు:
*కిచెన్ క్యాబినెట్లకు నలుపు రంగు : వాస్తు ప్రకారం వంటగదిలోని క్యాబినెట్లకు లేదా అరలకు నలుపు రంగు అస్సలు వాడకూడదు. నల్ల రంగు వల్ల ఇంట్లోని ఆడవారికి మానసిక ఒత్తిడి పెరుగుతుందని, అత్తాకోడళ్ల మధ్య సంబంధాలు దెబ్బతింటాయని నమ్ముతారు.

*వంటగది ఏ దిశలో ఉండాలి : ఇల్లు మధ్య భాగంలో వంటగది ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాగే, ఈశాన్యం (నార్త్-ఈస్ట్) దిశలో వంటగది ఉండటం వల్ల కూడా అత్తాకోడళ్ల మధ్య అస్సలు పడదు. వంటగది ఎప్పుడూ ఆగ్నేయం (సౌత్-ఈస్ట్) దిశలో ఉంటేనే చాలా మంచిది.

ALSO READ : జ్యోతిష్యం : విధి రాత, అదృష్టం బట్టి జీవితం నడుస్తుందా లేక సంకల్పం, లక్ష్యం ఆధారంగా జీవితం సాగుతుందా..?

*బుధవారం  వినాయకుడి పూజ: అత్తాకోడళ్ల మధ్య బంధం బాగుండాలంటే.. బుధవారం పొద్దున్నే స్నానం చేసి, ఒక పీటపై వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేయాలి. ఇలా భక్తితో చేయడం వల్ల వారి మధ్య కోపాలు తగ్గి, ప్రేమానురాగాలు పెరుగుతాయి.

*ఇంట్లో ముళ్ల మొక్కలు : ఇంట్లో కలబంద (అలోవెరా) లాంటి ముళ్ల మొక్కలు లేదా క్యాక్టస్ లాంటివి అస్సలు పెంచకూడదు. వీటివల్ల బంధాలలో దూరం పెరుగుతుంది. వీటికి బదులుగా ఇంట్లో తులసి మొక్క లేదా మనీ ప్లాంట్ పెంచడం వల్ల ఇంట్లోకి  పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

 

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.