ఖమేనీ అంత్యక్రియలకు.. 3వేల సమాధులు సిద్ధం చేశారు ఎందుకు?

ఖమేనీ అంత్యక్రియలకు.. 3వేల సమాధులు సిద్ధం చేశారు ఎందుకు?

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజలు, పలుదేశాల అధినేతలు, ప్రతినిధులు ఈ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా సంచలన విషయాలు వెలుగు చూశాయి. అంత్యక్రియల సందర్భంగా  ఏకంగా 3 వేల సమాధులను ముందుగానే సిద్ధం చేసినట్లు జర్మనీకి చెందిన ప్రముఖ వారపత్రిక వెల్లడించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

వారం రోజులు అంత్యక్రియల కార్యక్రమాలు  నిర్వహించిన తర్వాత వచ్చే శుక్రవారం(జూలై 9) న ఆయన జన్మస్థలం మషద్ లో ఖననం చేయనున్నారు. ఖమేనీ శవపేటికను మూడు రోజుల పాటు టెహ్రాన్‌లో ఉంచి, మంగళవారం పవిత్ర నగరమైన ఖోమ్‌కు తీసుకువెళతారు. అనంతరం బుధవారం పొరుగున ఉన్న ఇరాక్‌లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఆ తర్వాత శుక్రవారం ఈశాన్య ఇరాన్‌లోని ఆయన స్వస్థలమైన మషద్‌లో భైతిక కాయన్ని ఖననం చేస్తారు. ఫిబ్రవరి 28 అమెరికా జరిపిన దాడుల్లో మరణించిన ఖమేనీ పసి మనవరాలు జహ్రా మొహమ్మది,కుమార్తె, అల్లుడు, కుమారుడు మొజ్తబా ఖమేనీ భార్యతో పాటు పలువురు కుటుంబ సభ్యుల సమాధుల పక్కనే ఖమేనీ భౌతికకాయం ఖననం చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా టెహ్రాన్ లోని బెహెష్త్ ఏ జహ్రా స్మశాన వాటికలో దాదాపు 3 వేల సమాధులను సిద్దం చేశారని జర్మన్ కు చెందిన వార్తాపత్రిక WELT  సంచలన విషయాన్ని బయటపెట్టింది. వెల్ట్​ ప్రకారం..ఇరాన్ రెడ్ క్రెసెంట్ , జాతీయ సంక్షోభ నిర్వహణ సంస్థ తొలి ఉపాధ్యక్షుడు  మొహమ్మద్​ రెజా ఆరెఫ్​ కు  పంపిన ఓ సీక్రెట్​ లెటర్​లో  ఓ దారుణమైన అంచనాను రాసినట్లు తెలిపింది. ఖమేనీ అంత్యక్రియల  ఊరేగింపులో  దాదాపు 1500 నుంచి 3వేల మంది చనిపోవచ్చని  అంచనా వేసినట్లు టెహ్రాన్ మున్సిపాటిలిటీ ఉద్యోగి ఒకరు తెలిపినట్లు రాసింది. 

అంత్యక్రియలకు భారీగా జనం రావడం, దీనికి తోడు విపరీతంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో భారీ తొక్కిసలాట జరగొచ్చనే భయంతో ఎమర్జెన్సీ అధికారులు విపత్తు ప్రతిస్పందన ప్రణాళికలు రూపొందించారని ఆ లేఖలో రాసినట్లు తెలుస్తోంది. 

సిద్దం చేసిన సమాధులు నిజంగానే ఉన్నాయి.. 3వేల మంది చనిపోయినా ఫర్వాలేదని బాధ్యులకు చెప్పారని.. ఇంత పెద్ద జన సమూహం , తీవ్రవేడితో ఏం జరుగుతుందో  ఎవరికీ తెలియదని మున్సిపల్​ఉద్యోగి చెప్పినట్లు  వెల్ట్ పత్రిక వెల్లడించింది. ఒకవేళ నిజంగా తొక్కిసలాట జరిగితే  మృతులు, గల్లంతైన వారికోసం  ఓ ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 

3వేల సమాధులు సిద్దం చేయాల్సిన అవసరం  ఎందుకు వచ్చింది?

2020లో ఇస్లామిక్​ రెవల్యూషనరీ గార్డ్​ కార్ప్స్​ (IRGC )ఖుద్స్ ఫోర్స్ కమాండర్  ఖాసెమ్ సులేమానీ అంత్యక్రియల్లో జరిగిన ఘోరమై తొక్కిసలాట సంఘటన.. ఈ అత్యవసర ప్రణాళకపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. 
అమెరికా డ్రోన్ దాడిలో సులేమానీ హత్యకు గురికాగా ఇరాన్ వ్యాప్తంగా లక్షలాది మంది జనం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 2020 జనవరి 7న కెర్మాన్ లో జరిగిన అంత్యక్రియల్లో తొక్కిసలాటలో కనీసం 100 మంది చనిపోగా 200 మందికి పైగా గాయపడ్డారు. ఈ విషాదంతో సులేమానీ అంత్యక్రియలను  కొన్ని గంటలు నిలిపివేయాల్సి వచ్చింది. 

ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో కూడా లక్షలాది మంది పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. 2020 నాటి ఘటన పునరావృతం కాకుండా అధికారులు అత్యంత దారుణమైన పరిస్థితికి సన్నద్దమైనట్లు WELT రిపోర్టు చెబుతోంది.