పీఎం కేర్స్ ఫండ్ కు నిధులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పీఎం కేర్స్ ఫండ్ మొత్తం నిధి విలువ రూ. 8వేల 452.07 కోట్లకు చేరినట్లు ప్రకటించింది ప్రభుత్వం. పెట్టుబడి వ్యూహాల్లో తీసుకొచ్చిన మార్పుల కారణంగానే ఈ స్థాయిలో వృద్ధి సాధ్యమైందని అడిట్ నివేదికలు వెల్లడించాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రూ.7వేల 173.03 కోట్లుగా ఉన్న నిధులు, ఏడాది ముగిసే సమయానికి భారీగా పెరిగాయి.
గతంలో పీఎం కేర్స్ నిధులన్నీ సేవింగ్స్ అకౌంట్లో ఉండగా... ఇప్పుడు వాటిని ఫిక్స్డ్ డిపాజిట్లకు మళ్లించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం మొత్తం నిధుల్లో రూ. 6వేల 641 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉండగా.. రూ. 605.41 కోట్లు మాత్రమే సేవింగ్స్ ఖాతాల్లో ఉన్నట్లు సమాచారం.
►ALSO READ | సీజేపీ నిరసనతో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్
గత ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్లపై రూ.469.38 కోట్ల వడ్డీ లభించగా.. సేవింగ్స్ ఖాతాల ద్వారా రూ.5.77 కోట్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. దీంతో పాటు స్వదేశీ విరాళాల రూపంలో రూ. 479.04 కోట్లు, విదేశీ విరాళాల రూపంలో రూ. 92.83 లక్షలు అందగా... వివిధ ఏజెన్సీల నుంచి మరో రూ. 324.66 కోట్ల రిఫండ్‌లు చేరాయి.
