వాషింగ్టన్: ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరింత ముదురుతోన్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని అమెరికా కొత్త భూభాగంగా ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో దీనికి సంబంధించిన కొత్త మ్యాప్‌ను షేర్ చేశాడు. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ నియంత్రణ ఉందని ప్రకటించిన ట్రంప్.. తాజాగా ఏకంగా మ్యాప్‌నే షేర్ చేయడం సంచలనంగా మారింది. ట్రంప్ ప్రకటనతో ఇరాన్-అమెరికా మధ్య ప్రతిష్టంభనను మరింత తీవ్రతరం చేసింది.
హార్మూజ్ మూసే ఉంటది: ఇరాన్
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి నియంత్రణపై అమెరికా, ఇరాన్ మధ్య పోటీ నెలకొంది. హార్మూజ్ తమ నియంత్రణలో ఉందని ఇరుదేశాలు పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాతో కుదుర్చుకున్న 14 -అంశాల అవగాహన ఒప్పందంలోని తమ షరతులన్నీ పూర్తిగా నెరవేరే వరకు హోర్ముజ్ జలసంధి మూసివేసే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది.
►ALSO READ | కీవ్: మిట్టల్ ఫ్యాక్టరీపై రష్యా మిసైల్దాడి.. ఇద్దరు ఉద్యోగులు మృతి, 14 మందికి గాయాలు
ఇరాన్‌పై ఆంక్షలు, హార్మూజ్‌లో అమెరికా సైనిక కార్యకలాపాలను పూర్తిగా ఎత్తివేసినప్పుడే హార్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని పేర్కొంది. దుందుడుకు చర్యలతో పరిస్థితిని మరింత తీవ్రతరం చేయొద్దని అమెరికాను హెచ్చరించింది. అమెరికా ఎలాంటి దాడులు చేసిన ఎదుర్కొని దానికి ధీటుగా జవాబిచ్చేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని వార్నింగ్ ఇచ్చింది.
