సీజేపీ నిరసనతో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్

సీజేపీ నిరసనతో గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సస్పెండ్

సీజేపీ నిరసనలతో మహారాష్ట్రలో ఓ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు పడింది. స్థానికులతో కలిసి సీజేపీ చేపట్టిన నిరసనల కారణంగా సదరు ప్రిన్సిపాల్ ను విధుల నుంచి తొలగించారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రిన్సిపాల్ తరచూ మద్యం సేవించి స్కూల్ వస్తున్న క్రమంలో ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులతో కలిసి నిరసన చేపట్టింది అభిజీత్ దీప్కే నేతృత్వంలోని సీజేపీ.

ప్రిన్సిపాల్ ను తొలగించేవరకు తమ నిరసనలు ఆగవని పేర్కొంది సీజేపీ. దీంతో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రిన్సిపాల్ ను తొలగించడమే కాకుండా స్కూల్లో సిబ్బంది కొరతను తీర్చడానికి మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని కూడా డిమాండ్ చేస్తోంది సీజేపీ. విద్యావ్యవస్థను మెరుగుపరచడమే తమ లక్ష్యమని.. తమ డిమాండ్లు నెరవేరే వరకు సామాజిక ఉద్యమం కొనసాగుతుందని తెల్పింది సీజేపీ.

హింగోలి నుండి 'ఫిక్స్ అవర్ స్కూల్స్' క్యాంపెయిన్ ప్రారంభం

గత శనివారం ( ఆగస్టు 15 )  అభిజీత్ దీప్కే తన స్వగ్రామమైన హింగోలిలో “స్కూల్ థిక్ కరో” ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలు ఎదుర్కొంటున్న సౌకర్యాల కొరత, మౌలిక సదుపాయాల కొరత వంటి సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే క్యాంపెయిన్ లక్ష్యం. తన పర్యటన సందర్భంగా, దీప్కే పాఠశాలలను తనిఖీ చేసి, పగిలిన కిటికీలు, మూసుకుపోయిన మరుగుదొడ్లు, విద్యార్థులకు సరిపడా కూర్చునే సౌకర్యం లేకపోవడం వంటి సమస్యలను గుర్తించారు.

►ALSO READ | ఉదయం 4 గంటలకే ఫోన్లు.. 20 గంటల పని: సీఎం విజయ్ డైలీ షెడ్యూల్ రివీల్ చేసిన మంత్రి

స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాఠశాల పరిస్థితులను స్వయంగా పరిశీలించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతంలోని పాఠశాలల దుస్థితిపై దీప్కే ఆందోళన వ్యక్తం చేస్తూ, పిల్లలకు సరైన వాతావరణాన్ని కల్పించేందుకు తక్షణమే అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.సీజేపీ “జంతర్ మంతర్ సీజన్ 2” ఉద్యమాన్ని తిరిగి ప్రారంభిస్తుందని... ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించడానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.