Sania Mirza Marriage: భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆమె త్వరలోనే రెండో వివాహం చేసుకోబోతున్నారు అనే పోస్టులు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నేషనల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన కథనాలు రావడంతో ఈ న్యూస్ కాస్తా ఆన్ లైన్ లో ఫుల్ వైరల్‌గా మారింది. ఈ విషయంపై సానియా మీర్జా టీం ఇప్పటి వరకు క్లారిటీ మాత్రం ఇవ్వలేదు..
ఫారిన్ ఫ్రెండ్‌తో సీక్రెట్ రిలేషన్:
సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం, సానియా మీర్జా తన సింగిల్ లైఫ్‌కి గుడ్‌బై చెప్పి మళ్లీ ఒక ఇంటికి భార్య కాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా వరుడు ఎవరంటే? విదేశాలకు చెందిన తన ఒక స్నేహితుడితో సానియా గత కొన్ని రోజులుగా సీక్రెట్ రిలేషన్‌లో ఉన్నారని జోరుగా ప్రచారం కొనసాగుతోంది. సదరు విదేశీ వ్యక్తి దుబాయ్‌కు చెందినవాడు కావడంతోనే, ఆమె 2021లోనే దుబాయ్‌లో ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసి అక్కడ నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది.
దుబాయ్‌లోనే సింపుల్ వెడ్డింగ్?:
చాలా రోజుల పాటు సీక్రెట్‌గా ఉన్న ఈ రిలేషన్‌కు ఇప్పుడు కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సానియా తన కుటుంబ సభ్యులను ఒప్పించి రెండో వివాహానికి సిద్ధమయ్యారని, ఈ క్రమంలోనే సెకండ్ మ్యారేజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ పెళ్లి కనుక నిజంగానే జరిగితే, హడావుడి లేకుండా దుబాయ్‌లోనే అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలోనే చాలా సింపుల్‌గా ఈ పెళ్లి తంతు పూర్తి చేయాలని భావిస్తున్నారట. అంతేకాకుండా, పెళ్లి తర్వాత దుబాయ్‌లోని తన సొంత అపార్ట్‌మెంట్‌లోనే సానియా కాపురం పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
►ALSO READ | 84కే 4 వికెట్లు.. మరో 288 రన్స్ చేస్తేనే లంక గెలిచేది.. లేకపోతే విజయం భారత్దే
సానియా పెళ్లి వార్తల్లో అసలు నిజమెంత?:
ఈ వార్త ఆ నోటా ఈ నోటా పడి సోషల్ మీడియాలో జోరుగా షేర్ అవుతున్నప్పటికీ, దీనిపై సానియా ఫ్యామిలీ మాత్రం ఇప్పటి వరకు సానియా మీర్జా గానీ, లేదా ఆమె కుటుంబ సభ్యులు గానీ ఈ రెండో పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన (Official Statement) చేయలేదు. దీంతో ఇది కేవలం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఒక రూమర్ మాత్రమే అని తేలిపోయింది. అయితే సానియా పెళ్లి చేసుకుంటుందా లేదా అని ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
सानिया मिर्जा की खबर सुनी या नहीं
— Gaurav Yadav (@ImGauravYadav9) August 18, 2026
सुना है फिर से शादी कर रहीं हैं और
इस बार भी विदेशी से ही शादी.... Read News pic.twitter.com/MMiHlfPq04
