61 ఏళ్ల వయసులో.. ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులుగా ఆయన మాజీ భార్య, పిల్లలు !

61 ఏళ్ల వయసులో.. ఆమిర్ ఖాన్ మూడో పెళ్లి.. అతిథులుగా ఆయన మాజీ భార్య, పిల్లలు !

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్నారు. 47 సంవత్సరాల వయసున్న గౌరీ స్ప్రాట్ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా ఈ ఇద్దరి పెళ్లి జరిగింది. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆమిర్ ఖాన్ నివాసంలో శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు, కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాలకు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ పెళ్లికి విదేశాల నుంచి ఇరు కుటుంబాల దగ్గరి బంధువులు కూడా వచ్చారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సహా సుమారు 150 మంది అతిథులు మాత్రమే హాజరు కావడం విశేషం. మూడో పెళ్లి కావడంతో నిరాడంబరంగా ఈ తంతు కానిచ్చేయాలని ఆమిర్ ఖాన్ భావించారు. హాజరైన వారిలో ఆమిర్ పిల్లలైన జునైద్, ఇరా, ఆజాద్‌లతో పాటు గౌరీ కొడుకు కూడా ఉన్నాడు. 2026లోనే ఆమిర్, గౌరీ తమ సంబంధాన్ని ధృవీకరించారు. తాము దాదాపు పాతికేళ్లుగా ఒకరికొకరు తెలిసినప్పటికీ, కేవలం రెండేళ్ల క్రితమే డేటింగ్ ప్రారంభించినట్లు ఆమిర్ వెల్లడించారు.

ఆమిర్ గతంలో నిర్మాత రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి జునైద్, ఇరా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత ఆయన 2005లో చిత్ర నిర్మాత కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరూ 2021లో విడిపోయారు. తమ కుమారుడు ఆజాద్‌ను కలిసి పెంచుతున్నారు.

►ALSO READ | Breakfast సినిమా అందరికీ ఎక్కుతుందా..? ఓటీటీలోకి వచ్చిందిగా.. చూడొచ్చా..?
  
ఇక గౌరీ స్ప్రాట్ విషయానికొస్తే.. ఆమెకు కూడా ఇది వరకే పెళ్లైంది. భార్యాభర్త చట్టప్రకారం విడిపోయారు. వీరికి కూడా ఒక కొడుకు ఉన్నాడు. బెంగళూరుకు చెందిన గౌరీ మీడియా ముందు పెద్దగా కనిపించలేదు. ఆమె మాజీ సెలూన్ యజమాని అయిన రీటా స్ప్రాట్ కూతురు. వెల్నెస్, బ్యూటీ రంగంలో పనిచేస్తున్నారు. ఆమె ప్రస్తుతం ముంబైలో ఒక బిబ్లంట్ సెలూన్‌ను నడుపుతున్నారు.