Breakfast సినిమా అందరికీ ఎక్కుతుందా..? ఓటీటీలోకి వచ్చిందిగా.. చూడొచ్చా..?

Breakfast సినిమా అందరికీ ఎక్కుతుందా..? ఓటీటీలోకి వచ్చిందిగా.. చూడొచ్చా..?
  • టైటిల్: బ్రేక్​ఫాస్ట్
  • డైరెక్షన్: ఏఆర్​గాంధీ కృష్ణ
  • కాస్ట్: రాణవ్, రోస్మిన్, కృతిక మోహన్, అమితా రంగనాథ్, సంపత్ రాజ్​, బాలాజీ శక్తివేల్​
  • ప్లాట్​ఫాం: అమెజాన్ ప్రైమ్ వీడియో

శంతను (రాణవ్) ఇంజనీరింగ్ పూర్తి చేసి, మలేసియాలో కొంతకాలం జాబ్ చేస్తాడు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల అతను అక్కడి నుంచి వచ్చేస్తాడు. అయితే తాను మలేసియాలో ఉన్నట్టుగానే తల్లిదండ్రులను నమ్మిస్తూ, వాళ్ల అవసరాలను తీరుస్తుంటాడు. 

తండ్రి ట్రీట్మెంట్కి తగిన డబ్బును పంపిస్తూ ఉంటాడు. తన సర్టిఫికెట్స్ కూడా సీజ్ చేయటంతో, డబ్బు కోసం అతనకి తోచిన పనులను చేస్తూ వెళ్తాడు. అతను రాజారామ్ (సంపత్ రాజ్) కూతురు జాన్వీ (రోస్మిన్) కంటపడతాడు.

►ALSO READ | పోలీస్ కావాలనేది హీరో గోల్.. కానీ అనుకోకుండా హత్య కేసులో జైలుకు.. లింగం వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..

తండ్రి నడుపుతున్న బిస్కెట్ కంపెనీకి ఆమె జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉంటుంది. అలాంటి ఆమె శంతను గురించి తెలుసుకుని అతనికి తమ సంస్థలో జాబ్ ఇస్తుంది. వాళ్లిద్దరి మధ్య మొదలైన పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే ఆమె తండ్రి ఒక పెండ్లి సంబంధం తీసుకొస్తాడు. అప్పుడు జాన్వీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.