పోలీస్ కావాలనేది హీరో గోల్.. కానీ అనుకోకుండా హత్య కేసులో జైలుకు.. లింగం వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..

పోలీస్ కావాలనేది హీరో గోల్.. కానీ అనుకోకుండా హత్య కేసులో జైలుకు.. లింగం వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..
  • టైటిల్: లింగం
  • డైరెక్షన్: లక్ష్మీ శరవణకుమార్​
  • కాస్ట్: కథిర్, దివ్య భారతి, పూర్ణిమ రవి, బోస్​ వెంకట్​, సత్య, నిఖిలా శంకర్, విమల్​
  • ప్లాట్​ఫాం: జియో హాట్​స్టార్

కన్యాకుమారిలో ఫిషింగ్ హార్బర్​ ప్రాంతంలో ముత్తులింగం (కథిర్) తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ కావాలనేది అతని ఆశయం.

ముత్తులింగం, మలార్ (దివ్యభారతి) ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ ఊర్లో ప్రతి ఏడాది జాతర సందర్భంలో కబడ్డీ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంటుంది. ఆ ఏడాది గుణశీలన్ అనే రౌడీని మార్టిన్ అనే రౌడీ హత్య చేస్తాడు. అయితే సరిగ్గా ఆ ప్రదేశంలో ముత్తులింగం ఉండడంతో జైలుపాలవుతాడు.

అయితే తిరు కారణంగా జైలు నుంచి బెయిల్పై బయటికి వచ్చిన ముత్తులింగం, చెల్ల పాండియన్ దగ్గర ప్రధానమైన అనుచరుడిగా చేరతాడు. అటు పోలీసుల బారి నుంచి ఇటు గుణశీలన్ అనుచరుల నుంచి తప్పించుకోవడానికి అంతకు మించిన మార్గం లేదని అతను భావిస్తాడు.

ALSO READ : ఐశ్వర్య రాజేశ్ కొత్త వెబ్ సిరీస్ ఇసకపట్నం ఎలా ఉంది..?

చెల్ల పాండియన్ కారణంగా ముత్తులింగం అతని వల్ల చెల్ల పాండియన్ ఎదుగుతూ ఉంటారు. దాంతో వాళ్లద్దరినీ అంతం చేస్తే, తన ఆస్తిలో సగం వాటాను ఇస్తానని సామియప్పన్ ప్రకటిస్తాడు. ఆ తర్వాత ముత్తులింగం జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ.