Pinaka Teaser: బ్లాక్ మ్యాజిక్, మిస్టరీ థ్రిల్తో పినాక' టీజర్‌.. పీపుల్ మీడియాకి బ్లాక్‌బస్టర్ అవుతుందా?

Pinaka Teaser: బ్లాక్ మ్యాజిక్, మిస్టరీ థ్రిల్తో పినాక' టీజర్‌..  పీపుల్ మీడియాకి బ్లాక్‌బస్టర్ అవుతుందా?

కన్నడ స్టార్, గోల్డెన్ మెగాస్టర్ గణేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పినాక’ (PINAKA). కొరియోగ్రాఫర్‌‌ బి ధనంజయ ఈ చిత్రంతో  దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.  తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థగా గుర్తింపును అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడలో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ బ్యానర్‌‌‌‌లో 49వ చిత్రంగా తెరకెక్కుతోంది.

తాజాగా  ‘పినాక’ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అడ్వెంచర్, పురాణాలు, రహస్యాల మేళవింపుతో రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోందీ. ముఖ్యంగా ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని స్పష్టమవుతోంది. మిస్టరీ, బ్లాక్ మ్యాజిక్ అంశాలను కలిపి కొత్త తరహా కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకుడు బి. ధనంజయ ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

ALSO READ : అవార్డులు అడిగితే ‘అది భిక్షే’..

టీజర్‌లో గణేష్ 'క్షుద్ర', 'రుద్ర' అనే రెండు విభిన్న షేడ్స్‌లో కనిపించడం ఆసక్తిని పెంచింది. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్ గత సినిమాలకు భిన్నంగా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో ఒక కొత్త కోణాన్ని చూపించే అవకాశం కనిపిస్తోంది.

టీజర్‌లో డైలాగ్స్ కంటే విజువల్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. చీకటి వాతావరణం, రహస్య ప్రదేశాలు, పురాతన శిల్పాలు, బ్లాక్ మ్యాజిక్‌కు సంబంధించిన విజువల్స్ కథపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా థ్రిల్లింగ్ ఫీల్‌ను మరింత బలపరిచింది.

కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్న బి. ధనంజయ దర్శకుడిగా తొలి చిత్రంతోనే డిఫరెంట్ జానర్‌ను ఎంచుకోవడం విశేషం. అలాగే తెలుగు నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కన్నడలో నిర్మిస్తున్న చిత్రం కావడంతో ప్రొడక్షన్ విలువలు కూడా రిచ్‌గా కనిపిస్తున్నాయి. అక్టోబర్ 20 గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయునున్నట్లు ప్రకటించారు.