మధ్య తరగతి జీవితాల సొంతింటి కలను వ్యాపారంగా మార్చుకోవడంలో కన్స్ట్రక్షన్ కంపెనీలు ఆరితేరాయి. లేనిపోని ఆశలు కల్పించి ఫ్లాట్లు కొనిపించడమే కాకుండా.. డబుల్ రిజిస్ట్రేషన్స్ చేసి నిండా ముంచడం ఎన్నో కేసుల్లో చూసే ఉంటాం. లేటెస్టుగా ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ.. రూపాయి రూపాయి కూడబెట్టి కొనుకున్న ఫ్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్స్ చేసి బాధితులను నిండా ముంచింది. ఈ భారీ మోసానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నార్సింగి పుప్పాలగూడలో ప్రణీత్ కన్స్ట్రక్షన్ బాధితులు ఆదివారం (జులై 05) ధర్నాకు దిగారు. ఏడేళ్ల క్రితం ఫ్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ.. ఇంకా ఫ్లాట్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
►ALSO READ | కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మనోహర్ లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ లేఖ
మొత్తం110 ఫ్లాట్లను 220 మందికి డబుల్ రిజిస్ట్రేషన్ చేసి విక్రయించారంటూ ఆరోపించారు. ఒక్కో ఫ్లాట్ రూ.70 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వసూలు చేసి ఫ్లాట్లు ఇవ్వలేదని ప్రణీత్ గ్రూప్ అధినేత సురేష్, కుమారుడు ప్రణీత్‌పై బాధితుల చేశారు.
సంస్థ ప్రతినిధులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అప్పులు చేసి, బంగారం, పొలాలు తాకట్టు పెట్టి డబ్బులు చెల్లించామంటున్నారు బాధితులు. అద్దెలు, రుణాలు, పిల్లల ఫీజులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. సొంతింటిలోకి వెళితే ఈ తిప్పలు తప్పుతాయనే ఆశతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
