లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

లైంగిక వేధింపుల కేసులో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

హైదరాబాద్: పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావుకు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‎లో ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును హైకోర్టు కొట్టివేసింది. కాగా, ఉద్యోగం ఇప్పిస్తానని, టీవీ చానల్ ఏర్పాటు చేస్తానని నమ్మించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అలాగే రూ.5 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వలేదని రేగా కాంతారావుపై ఓ యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో తనపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని కాంతారావు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఎఆర్‎ను కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండానే తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ఫిర్యాదు చేశారని, నాలుగేళ్ల కింద జరిగినట్లు చెబుతున్న ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ఈ పిటిషన్‎పై విచారణ చేపట్టిన హైకోర్టు రేగా కాంతారావు వాదనలతో ఏకీభవిస్తూ ఆయన నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేసింది.