జపాన్‌లోని నగోయా నగరంలో గత రెండు వారాలుగా అత్యంత ఉత్కంఠభరితంగా కొనసాగిన 20వ ఆసియా క్రీడలు (Asian Games 2026) ఈరోజు (అక్టోబర్ 4, ఆదివారం)తో విజయవంతంగా ముగిశాయి. నగోయాలోని మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో జరిగిన అట్టహాసమైన ముగింపు వేడుకలతో (Closing Ceremony) ఈ మెగా టోర్నమెంట్‌కు అధికారికంగా తెరపడింది.
దోహా 2030కి బాధ్యతల బదిలీ:
ఈ ముగింపు వేడుకల్లో అత్యంత కీలక ఘట్టం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) జెండా మార్పిడి కార్యక్రమం జరిగింది. ఐచి-నగోయా 2026 నిర్వాహకుల నుంచి OCA జెండాను తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ రాజధాని దోహా 2030 (Doha 2030) నిర్వాహకులకు అధికారికంగా అందజేశారు. వన్ ఆసియా (One Asia) అనే బలమైన సందేశాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆసియా క్రీడా స్ఫూర్తిని దోహాకు బదిలీ చేశారు.
►ALSO READ | భారత్ vs ఉరుగ్వే మ్యాచ్‌కు 22 వేల ఫ్రీ టికెట్లు: మిస్సైన మెస్సీ ఫ్యాన్స్‌కు బెంగాల్ సీఎం బిగ్ గిఫ్ట్!
సవాళ్లను ఎదుర్కొంటూ సక్సెస్ ఫుల్ జర్నీ:
ఈ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా కొన్ని ఆపరేషనల్ సవాళ్లు, వసతి పరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అంతిమంగా అథ్లెట్లకు తమ ప్రతిభను చాటుకోవడానికి, అత్యుత్తమ ప్రదర్శన కనబరచడానికి కావలసిన అన్ని వాతావరణాన్ని, పరిస్థితులను కల్పించడంలో తాము విజయం సాధించామని OCA ధృవీకరించింది. సవాళ్లు ఎదురైనా ఆసియా దేశాల క్రీడాకారులు చూపిన ప్రతిభ ఈ క్రీడలను చరిత్రాత్మకంగా నిలిపిందని నిర్వాహకులు కొనియాడారు.
