హైదరాబాద్: సచివాలయానికి నీటి సరఫరా నిలిచిపోయిందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని జలమండలి స్పష్టం చేసింది. తెలంగాణ సచివాలయానికి మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని తెలిపింది. సమాచారం అందిన వెంటనే సచివాలయంలో సంపును జలమండలి అధికారులు పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి సంపును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పరిశీలనలో సంపులో నీటిమట్టం పూర్తి స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు.
జలమండలి నుంచి సచివాలయానికి రోజువారీ నీటి సరఫరా యథావిధిగా కొనసాగింది. ఎలాంటి అంతరాయం లేకుండా మంచినీటి సరఫరా జరుగుతోందని నిర్ధారణ అయింది. సచివాలయానికి నీటి సరఫరా నిలిచిపోయిందన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టమైంది. జలమండలి వైపు నుంచి నీటి సరఫరాలో ఎలాంటి సమస్య లేదని ప్రకటించింది.
