సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు భారీ షాక్ ఇచ్చింది. సీఈసీ జ్ణానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సీజేఐ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో మాత్రమే జరగాలని సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఇద్దరు కమిషనర్ల ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఫారమ్-6 సవరణలు, ఓటర్ల జాబితా సవరణ (SIR) నిర్ణయాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ జరిపింది.
ఎన్నికల సంఘం నిర్ణయ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై భారత ఎన్నికల సంఘానికి, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు, మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జ్ఞానేష్ కుమార్‌ను సస్పెండ్ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
సీఈసీ జ్ణానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాల రద్దును కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టింది. వికాస్ సింగ్ వాదనల అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. 'CEC & ECs Act' ప్రకారం నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో జరగాలని, సీఈసీ ఒంటరిగా నిర్ణయించలేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పక్కన పెట్టి నిర్ణయాలు అమలు చేశారని పిటిషనర్లు ఆరోపించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలకు, ముఖ్యంగా ఫారం 6కు చేసిన మార్పుకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని భారత ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషనర్ల మధ్య ఏకాభిప్రాయం లేకుండా అనధికారికంగా మార్గదర్శకాలు, సాఫ్ట్‌వేర్‌లలో మార్పులు చేశారని ఆరోపిస్తూ, కమిషన్ పనితీరును ప్రశ్నిస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ నిర్ణయాలు ఏకగ్రీవంగానా, మెజారిటీతోనా, లేక కేవలం జ్ఞానేష్ కుమార్ సొంత నిర్ణయాలేనా.. అని ధృవీకరించాలని కోర్టు భావించింది. ఏకాభిప్రాయం లేకుండా తీసుకున్న నిర్ణయాలు చెల్లవని కోర్టు నొక్కిచెప్పింది. ఫారం 6 మార్పును తాము ఆమోదించలేదని స్పష్టం చేసింది.
