హైదరాబాద్ లోని మేడిపల్లి క్యారెట్ లేన్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. అర్థరాత్రి షట్టర్ తొలగించి షాపులోని డైమండ్ నగలు, బంగారు నగలు ఎత్తుకెళ్లారు దుండగులు. సోమవారం ( అక్టోబర్ 5 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... మేడిపల్లిలోని బోడుప్పల్ రోడ్ లో ఉన్న క్యారట్ లేన్ జ్యూవెలరీ షాపులో చొరబడి భారీగా బంగారు, డైమండ్ నగలు ఎత్తుకెళ్లారు దొంగలు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాపులోని సీసీటీవీ కెమెరాలు షాపు పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు పోలీసులు. క్లూస్ టీం సహకారంతో వేలిముద్రలు వంటి కీలక ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాటా లాంటి దిగ్గజ సంస్థకు చెందిన జ్యూవెలరీ షాపులో చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. ఘటన జరిగిన సమయంలో షాపు దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారా లేదా..? ఈ చోరీ వెనుక ఎవరి హస్తం ఉంది..? వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
