విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఫ్లైట్ టికెట్ ధరలు.. రేపటి నుంచే అమలు..

విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఫ్లైట్ టికెట్ ధరలు.. రేపటి నుంచే అమలు..

విమాన ఇంధన (ATF) ధరలు భారీగా పెరగడంతో విమాన సంస్థ 'ఇండిగో' ఫ్లయిట్ టికెట్లపై ఫ్యూయల్ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్తగా పెంచిన ఛార్జీలు అక్టోబర్ 6, 2026 (నైట్ 12:01 AM) నుంచి చేసే అన్ని రకాల టికెట్ బుకింగ్‌లకు వర్తిస్తాయి.

విమాన ఇంధన (ATF) ధరలు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పెరిగిన తర్వాత, అక్టోబర్ 1న లీటరుకు మరో రూ.16 (సుమారు 13.2%) పెరిగాయి. లీటర్ ఏటీఎఫ్ ధర రూ.121 నుంచి రూ.137కి చేరడంతో, గత 10 ఏళ్లలోనే అత్యధిక ధరకు చేరినట్లయింది. విమాన సంస్థలకు అయ్యే ఖర్చుల్లో ఇంధనానిదే ఎక్కువ భాగం కావడం వల్ల ఈ ప్రభావం టికెట్ ధరలపై పడింది.

కొత్తగా పెరిగిన ఛార్జీల వివరాలు:
 దేశీయ విమానాలు:

ఇండియాలో ప్రయాణించే వారికి దూరాన్ని బట్టి ప్రతి సెక్టార్‌పై రూ. 375 నుంచి రూ. 1,300 వరకు ఇంధన ఛార్జీలు వసూలు చేయనున్నారు. 

 అంతర్జాతీయ విమానాలు:
విదేశాలకు వెళ్లే వారికి (SAARC దేశాలు) 500 కి.మీ లోపు దూరానికి రూ. 1,000, అంతకంటే ఎక్కువ దూరానికి రూ. 3,000  ఛార్జ్ చేయనున్నారు. మిడిల్ ఈస్ట్ / ఆగ్నేయాసియా / గల్ఫ్ / ఈస్ట్ ఆసియా అయితే  రూ. 5,500, ఆఫ్రికా అయితే రూ. 6,000, యూరప్ (ఐరోపా) అయితే  రూ. 10,000  వసూలు చేయనున్నారు. 

ఇండిగో ఏమంటోంది?
ఇంధన ధరలు భారీగా పెరగడం వల్ల విమాన సంస్థ నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని ఇండిగో తెలిపింది. అయితే ఈ భారమంతా ప్రయాణికులపై వేయకుండా, పెరిగిన ఖర్చుల సర్దుబాటు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇంధన ధరల ఆధారంగా మళ్లీ ఛార్జీలను సవరించే అవకాశం ఉందని తెలిపింది.