Mandaadi OTT Release : ఓటీటీలోకి సూరి, సుహాస్ 'మందాడి'.. బ్లాక్‌బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Mandaadi OTT Release : ఓటీటీలోకి సూరి, సుహాస్ 'మందాడి'.. బ్లాక్‌బస్టర్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

కోలీవుడ్ నటుడు సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాన్ ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం 'మందాడి'. సెప్టెంబర్ 10న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.  బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలచిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది.

మదిమారన్ పుగళేంది దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది..  తెలుగు, తమిళంతో పాటు హిందీ సహా పలు భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.  థియేటర్లలో మిస్ అయిన సినీ ప్రియులకు ఇది మరో మంచి అవకాశం

ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ముత్తు కాళి, సాట్టా పులి కాలక్రమంలో బద్ధ శత్రువులుగా మారడం కథలో కీలక మలుపు తిరుగుంది. పరిస్థితుల కారణంగా ఊరిని వదిలి హైదరాబాద్‌లో జీవిస్తున్న ముత్తు కాళి.. మల్లేశ్ అనే యువకుడి కారణంగా మళ్లీ తన స్వగ్రామానికి తిరిగి రావాల్సి వస్తుంది. అసలు మల్లేశ్ ఎవరు? అతనికి కాళితో ఉన్న సంబంధమేంటి? తిరిగి వచ్చిన కాళి ఎదుర్కొన్న సమస్యలేంటి? అనేదే అసలు కథ.

సముద్ర నేపథ్యంతో తెరకెక్కిన 'మండాడి'లో పడవ పందేలు, స్నేహం, శత్రుత్వం, పగ, ప్రతీకారం వంటి అంశాలను దర్శకుడు ఆసక్తికరంగా మేళవించారు. కళింగపట్నంలో తరతరాలుగా కొనసాగుతున్న పడవ పందేల్లో మండాడి జట్టుకు ప్రాతినిధ్యం వహించే ముత్తు కాళి, సాట్టా పులి పాత్రల్లో సూరి, సుహాస్ ఆకట్టుకున్నారు. ముని పాత్రలో సత్యరాజ్ కీలకంగా కనిపించారు.

ఎల్రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మహిమా నంబియార్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా సముద్రంలో చిత్రీకరించిన క్లైమాక్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచింది. ఇప్పుడు అదే థ్రిల్‌ను ఇంటి నుంచే ఆస్వాదించే అవకాశం రావడంతో 'మండాడి' ఓటీటీ జర్నీపై ఆసక్తి నెలకొంది.