కాకా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నా: మంత్రి వివేక్ వెంకటస్వామి 

కాకా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నా: మంత్రి వివేక్ వెంకటస్వామి 

కాకా గడ్డం వెంకటస్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో అధికారికంగా కాకా జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. సోమవారం ( అక్టోబర్ 5 ) జరిగిన ఈ వేడుకలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ నేతలు, కాకా అభిమానులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాకా స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్నానని అన్నారు.

కాకా వెంకటస్వామి కార్మిక పక్షపాతిగా నిరంతరం వారికోసం పని చేశారని..RFCL, సింగరేణిని నిలబెట్టింది కాకానే అని అన్నారు మంత్రి వివేక్. పార్టీలు వేరైనా కాకా, దత్తాత్రేయలది ప్రత్యేక అనుబంధమని అన్నారు. కాకాకు మంత్రి పొన్నం కుమారుడితో సమానమని.. పేదల కోసం కాకా నిరంతరం పోరాడాడని అన్నారు మంత్రి వివేక్. 70 వేల మంది పేదలకు కాకా గుడిసెలు వేయించారని అన్నారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ...

కాకా వెంకటస్వామి కార్మిక పక్షపాతిగా నిరంతరం వారికోసం పని చేశారని... అంబేద్కర్ విదానంతోనే కాకా పేదలకు వైద్యసేవ చేశారని అన్నారు. అంబేద్కర్ స్పూర్తితో కాకా విద్యాసంస్థలు ఏర్పాటు చేశారని అన్నారు. కాకా కుటుంబం ఎంత స్థాయిలో ఉన్న పేదల కోసం పని చేస్తారని అన్నారు పొన్నం. తెలంగాణ ఉద్యమంలో తమను ఎంతగానో ప్రోత్సహించారని అన్నారు. NSUIలో కాకా తనను ప్రోత్సహించారని అన్నారు మంత్రి పొన్నం.