గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి : 8 వేల గుండె ఆపరేషన్ల చేసిన డాక్టర్లు చెబుతున్న 5టిప్స్ ఇవే

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయండి : 8 వేల గుండె ఆపరేషన్ల చేసిన డాక్టర్లు చెబుతున్న 5టిప్స్ ఇవే

హార్ట్ ప్రాబ్లమ్స్.. ఇటీవల కాలంలో గుండె జబ్బులు చాలా వేగంగా పెరుగుతున్నాయి.చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు  గుండెజబ్బుల బారిన పడుతున్నారు.  ఏటా 2కోట్ల గుండె సంబంధ జబ్బులతో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కలు చెబుతున్నాయి. మన దేశంకూడా హార్ట్ అటాక్ లతో మరణాలు బాగా పెరుతుగున్నాయి. మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, పొగతాగడం, వ్యాయామం లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో  దీనికి ప్రధాన కారణాలుగా డాక్టర్లు చెబుతున్నారు. అయితే జాగ్రత్తలు, నివారణ మార్గాల ద్వారా గుండె జబ్బులకు చెక్ పొట్టొచ్చంటున్నారు  8వేల గుండె ఆపరేషన్ల చేసిన డాక్టర్. అవేంటో తెలుసుకుందాం. 

గుండె జబ్బులు వచ్చాక దాని ఆరోగ్యం కోసం ఆస్పత్రులకోసం వెళ్లడం కంటే ముందు దాని   జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు కార్డియాలజీలో అనుభవం ఉన్న ప్రముఖ డాక్టర్లు. దీనికోసం పెద్దగా చేయాల్సిందేమీ లేదు.. జీవనశైలిలో కఠినమార్పులు అవసరం లేదు.. చేయాల్సిదల్లా గుండె సమస్యలు  రాకుండా నివారించే సాధారణ మార్పలు చాలంటున్నారు.  దాదాపు 8వేల గుండె ఆపరేషన్లు చేసిన ప్రముఖ కార్డియాలజిస్టు,బోర్డ్-సర్టిఫైడ్ కార్డియోవాస్కులర్ సర్జన్,  డాక్టర్ జెరెమీ లండన్  గుండె ఆరోగ్యం కోసం చేయాల్సిన ఐదు టిప్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేశారు.  

గుండె ఆరోగ్యం కోసం చేయాల్సినవి ఇవే.. 

పొగతాగడం మానేయండి ..

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. మొదటి పొగతాగడం మానేయాలంటున్నారు డాక్టర్ .. బీడీ, సిగరెట్,గాంజా  వంటి మత్తు  పదార్థాలు  ఖచ్చితంగా బంద్  చేయాలంటున్నారు. పొగతాగడం వల్ల టాక్సిక్ కెమికల్ రక్తంలో కలిసి గుండెపై ఒత్తిడి కలిగిస్తాయంటున్నారు. 

ప్రాసెస్డ్ ఫుడ్ కు దూరంగా..

ప్రాసెస్డ్ ఫుడ్ తో గుండె కు ఎప్పటికైనా ప్రమాదమే అంటున్నారు డాక్టర్లు. ప్యాకేజ్డ్ ఫుడ్ తినదగిన ఆహారం కాదు.. వాటిలో అధికంగా ఉప్పుడ, బ్యాడ్ కొలెస్ట్రాల్, అదనంగా షుగర్ ఉంటుంది.. అవి కణ నిర్మాణాన్ని దెబ్బతీస్తాయంటున్నారు. 

జీవన శైలిలో మార్పులు..

మానవ శరీరం కదలికలకోసం రూపొందించారు. చాలామంది  రోజంతా కూర్చొని పనిచేస్తుంటారు. కదలకుండా ఉండటం చాలా ప్రమాదం.. శరీరంలో కదలికలు తప్పనిసరి అంటున్నారు కార్డియాలజిస్టు.  భోజనం తర్వాత 10 నిమిషాల నడకతో రక్తంలో చక్కెర్ లెవెల్ నియంత్రించొచ్చంటున్నారు.

ఒంటరితనాన్ని వదులుకోండి..   

ఒంటరితనం గుండెకు ముప్పు అని డాక్టర్లు షాకింగ్ విషయాలు చెప్పారు. ఒంటరి తనం కేవలం ఒక విచారం మాత్రమే కాదు.. గుండెజబ్బులకు దారి తీస్తుందంటున్నారు. కాబట్టి మానవ సంబంధాలను పెంచుకుంటూ నలుగురిలో కలిసుంటే మంచిందంటున్నారు. 

 చాలాకాలంగా ఒత్తిడి ఉంటే.. 

చాలాకాలంగా ఒత్తిడిలో ఉన్నట్టయితే జాగ్రత్త తీసుకోవాలంటున్నారు డాక్టర్లు.  ఇది గుండె  రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. గుండెజబ్బులకు కారణం అవుతుందని చెబుతున్నారు. నిర్లక్ష్యం చేయొద్దని వార్నింగ్ ఇస్తున్నారు.  

పైన చెప్పిన కారణాలన్నీ గుండెజబ్బులు,  పక్షవాతానికి ప్రధాన కారణాలు తగిన జాగ్రత్తలు తీసుకొని మీ గుండెను పదిలంగా ఉంచుకోవాలంటున్నారు డాక్టర్లు. 
గమనిక: ఈ ఆర్టికల్ లోని సమాచారం ఆరోగ్యం ,ఫిట్‌నెస్ సలహాలతో కూడిన సాధారణ సమాచారం మాత్రమే. దీనిని అర్హత కలిగిన మెడికల్ అడ్వైస్ గా భావించవద్దు. రోగ నిర్దారణ కోసం  నిపుణులను సంప్రదించాలి.